ఏపీ గురించి తెలుసుకోవడానికి ఈ మెసేజ్ చాలు

August 03, 2020

ఏపీ గురించి తెలుసుకోవడానికి ఏ ప్రత్యేక పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు మీకు. రాష్ట్రం గురించి ప్రపంచం ఏమనుకుంటోందో? ప్రపంచం రాష్ట్రంతో ఎలాంటి సంబంధాలు నెరపాలనుకుంటుందో? తెలిస్తే సరిపోతుంది కదా. మరి ఆ ఒక్కటి తెలిసేది ఎలా అనుకుంటున్నారా? ఒకే ఒక్క మెసేజ్ తో మీకంతా అర్థమైపోతుంది.  #byebyeAP అని ప్రపంచం ఎలా చెబుతుందో .. మన అభివృద్ధి ఎంత తిరోగమిస్తుందో చెప్పడానికి ఇది చక్కగా సరిపోతుంది. 

2018 తో పోలిస్తే... 2019లో ఏపీలోని అన్ని ఎయిర్ పోర్టులకు వచ్చే ప్రయాణికుల సంఖ్య ఏ మాత్రం పెరగకపోగా దారుణంగా పడిపోయింది. అంటే... ఇన్వెస్టర్ల రాక, టూరిజం, హాస్పిటాలిటీ అన్ని తిరోగమించే పరిస్థితి ఏపీ అంతటా ఉంది. ఆ ఫిగర్స్ ఇవే. 

విజయవాడ - 93,686 (-5.7% పడిపోయింది)
విశాఖపట్నం - 2,19,114 (-10.9% పడిపోయింది)
తిరుపతి - 62,445 (-0.2% పడిపోయింది)
రాజమండ్రి - 37,886 (-12.1% పడిపోయింది)
కడప - 8,833 (-15.3% పడిపోయింది) 

ఇందులో ఒక విషయం గమనించారా? తిరుపతి పుణ్యక్షేత్రం కాబట్టి... ఆ శ్రీవారి దయవల్ల తగ్గుదల తక్కువగా ఉంది. మిగతా చోట్ల అలాంటి అవకాశం లేదు కదా.