చంద్రబాబు కట్టిన ఇళ్లెన్ని?

August 10, 2020

పార్టీలు ఆన్ అండ్ ఆఫ్...  ప్రభుత్వం శాశ్వతం. ఒక రోడ్డు గత ప్రభుత్వం మొదలుపెడితే... తర్వాత ప్రభుత్వం దానిని ప్రారంభిస్తుంది. చాలా పనులు ప్రారంభించే పార్టీలకే దక్కుతాయి. మొదలుపెట్టిన పార్టీలకు దక్కవు. కాన్నీ కొన్ని మాత్రం మొదలుపెట్టిన పార్టీలకే క్రెడిట్ ని ఇస్తాయి. అలాంటి చంద్రబాబు హయాంలోని పేదల ఇళ్ల పథకం.

చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఆర్థిక లోటులో కూడా 10 లక్షల ఇళ్లు కట్టింది. వాటిలో తాము దిగిపోయేలోపు 6 లక్షల ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందించింది. మిగతా 4 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉండిపోయాయి. అవి ఎవరికి పంచాలో కూడా టీడీపీ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించేసింది. దీంతో తదనంతరం ఏర్పడిన జగన్ సర్కారు ఆ ఇళ్లను పంచడానికి తటపటాయిస్తోంది. సిద్ధమైపోయినా వాటిని పెండింగ్ లో పెట్టిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు.  

గత పదమూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా పేదలకు స్వాధీనం చేయలేదని అన్నారు. నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్నవాటిని ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.  పేదలకు ఆ ఇళ్లను పంచకుండా వాటిని కరోనా క్వారంటైన్‌ కేంద్రాలుగా పెట్టారు. ఇపుడు అందులో ఉంటున్నవారు ఈ ఇళ్లు అద్భుతంగా ఉన్నాయని వీడియోలు తీసి పంపుతుంటే వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పరువుపోతుందని ఇలా చేస్తున్నారు. తెలుగుదేశం చేసిన మంచి పనులు జనానికి తెలియకూడదన్నది జగన్ ఉద్దేశం అని బాబు విమర్శించారు.