తెలంగాణ టెస్టుల తక్కువ చేయడానికి కారణమిదే

August 11, 2020

ఏపీ కోవిడ్ టెస్టుల్లో దూసుకుపోతోంది. తెలంగాణలో బాగా నెమ్మదిగా సాగుతోంది. అసలు ఎందుకిలా జరుగుతోంది. ఏపీ వాళ్లు టెస్టులు ఎలా చేస్తున్నారు? తెలంగాణ వాళ్లు ఎలా చేస్తున్నారు. ఎందుకు ఈ తేడా వస్తోంది. తెలుసుకుందామా? అసలు ఈ టెస్టుల కారణంగానే కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరి దీని సంగతేందో చూద్దాం. 

టెస్టుల కంటే ముందు మనం మానవ దేహంలోని "యాంటిజెన్", "యాంటీబాడీ"ల గురించి తెలుసుకోవాలి. దేవుడు మన దేహంలో స్వతంత్ర రక్షణ వ్యవస్థ పెట్టాడు. అవే "యాంటీబాడీలు", ఇవి యాంటీజెన్ లతో పోరాడతాయి. వైరస్ లు మన శరీరంలోకి ప్రవేశించినపుడు మనలోని రక్షక వ్యవస్థ (ఇమ్మునో గ్లోబులిన్స్) అయిన యాంటీబాడీలు వాటితో పోరాడతాయి. పోరాటంలో యాంటీబాడీస్ గెలిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. యాంటీజెన్ గెలిస్తే మనం అనారోగ్యానికి గురవుతాం. అపుడు బయటి నుంచి మనకు వైద్యం అవసరం అవుతుంది. 

కోవిడ్ -19 ను నిర్దారించడానికి మనదేశంలో 3 రకాలు పరీక్షలు చేస్తున్నారు. 

RT-PCR : దీని ద్వారా మన శరీరంలో వైరస్ RNA జీనోమ్ (యాంటీజెన్) కనిపెడతారు. ఇది అత్యంత నమ్మదగిన, ఖచ్చితమైన పరీక్ష. ఇది ఒక్క వైరస్ అణువును కూడా తొలి దశలోనే గుర్తించ గలదు. 

TrueNat/CBNAAT : ఇవి కూడా వైరల్ జీన్స్ ని కని పెట్టడానికి వాడతారు. కాకుంటే ఇది పరిమాణ పరీక్షలు మాత్రమే. ధర కూడా తక్కువ. తీసుకున్న నమూనా సరిగ్గా లేకుంటే ఇవి వైరస్ ను గుర్తించలేవు. RTPCR కంటే ఈ పద్ధతిలో వేగంగా ఫలితాలు వస్తాయి. కానీ ఖచ్చితత్వం ఉండదు. దీని ఫలితాలు శాంపిల్ సేకరణ చేసేవారిని బట్టి, వాడే కిట్స్ ను బట్టి, సిబ్బంది నైపుణ్యాలను బట్టి ఉంటాయి. అంటే ఈ పద్ధతిలో వచ్చిన ఫలితాలు పూర్తిగా నమ్మదగినవి కాదు. పొరపాటు మెషీన్ లో లేదు అంతకుముందే జరిగే ప్రక్రియలో ఉంటుందన్నమాట. 

Rapid Test kits:  - రాపిడ్ టెస్టింగ్ కిట్స్ అస్సలు గ్యారంటీ ఉండదు. కేవలం "యాంటీ బాడీస్" ని కనిపెట్టడం ద్వారా రోగ నిర్ధారణ చేస్తారు. వైరస్ వచ్చిన వెంటనే యాంటీబాడీస్ తయారుకావు. కోవిడ్ ఉన్నా సోకిన తొలిరోజే పరీక్ష చేశారనుకో మనకు కరోనా లేదని ఫలితం వచ్చే అవకాశం ఉంది. అందుకే వీటిలో ఖచ్చితత్వం బాగా తక్కువ. ఈ టెస్టు చేశాక... పైన వివరించిన రెండింటిలో ఏదో ఒక టెస్టు కూడా చేస్తేనే సరైన ఫలితం చెప్పగలం అన్నమాట.

ఇన్ని రకాల టెస్టుల వల్లనే తెలంగాణలో, ఏపీలో గందరగోళం జరుగుతోంది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 11 చోట్ల RTPCR, 47 చోట్ల TrueNat పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసింది. 

తెలంగాణ ప్రభుత్వం 10 చోట్ల RTPCR, నాలుగు చోట్ల CBNAAT పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసింది. 

తెలంగాణలో తక్కువ టెస్టులు జరిగినా జరిగేవన్నీ ఎక్కువగా ఆర్టీపీసీఆర్ ద్వారా జరగడంతో కచ్చితమైన ఫలితాలుగా మనం భావించవచ్చు.

================

ఇన్ పుట్స్ - 

Dr.A.V.S.Reddy 
ట్విట్టరు ఐడీ-  @dravsreddy
Medical Doctor with MBBS,MD; Actively Working on Oncology Biosimilars.