ఇలాంటి ట్రిక్కులు తెలుసు కాబ‌ట్టే...మోదీకి ఎదురులేదు

June 03, 2020
CTYPE html>
``గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని ప‌ద‌విని తిరిగి మోదీ సొంతం చేసుకున్నంత మాత్రాన....ఆయ‌న‌కు అంద‌రూ ఓటేశార‌ని అనుకోవడానికి వీల్లేదు. ఆయ‌న విధానాల్లో ఎన్నో త‌ప్పులు అప్పుడూ...ఇప్పుడూ ఉన్నాయి``. ఇది ఓ అంత‌ర్జాతీయ ప్ర‌ముఖుడు చెప్పిన మాట‌. ``ప్రధానితో సమావేశం తనకు నాకు ప్రత్యేక అనుభవం. నేలపై నివసించి, క్షేత్రస్థాయిలో జీవన విధానం ఎలా ఉందో తెలుసుకోవడం ద్వారా ఉత్తేజం పొందే అధికార వ్యవస్థ భారతదేశానికి ఎంతో అవసరం`` ఇదే స‌ద‌రు వ్య‌క్తి అదే ప్ర‌ధాని గురించి చేసిన ప్ర‌శంస! ఆ వ్య‌క్తి ఎవ‌రంటే....నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీ. ఇలా విమ‌ర్శ‌కుల నోట ప్ర‌శంస‌లు పొందే స‌త్తా ఉంది కాబ‌ట్టే...ప్ర‌ధాని మోదీ అలా ప్ర‌త్య‌ర్థులు అందుకోలేని స్థితికి చేరుతున్నార‌ని అంటున్నారు.
ప్ర‌ధానితో స‌మావేశం గురించి మీడియాకు అభిజిత్ ఆస‌క్తిక‌రంగా విశ్లేషించ‌డం...మోదీ ఆయ‌న్ను ఫిదా చేసిన తీరుకు నిద‌ర్శ‌నం. దేశం గురించి తన ఆలోచనా విధానాలను వివరించేందుకు ప్రధాని తనకు ఎంతో సమయాన్ని కేటాయించి మాట్లాడారని అభిజిత్ తెలిపారు. ప్రధానితో సమావేశం తనకు ఒక ప్రత్యేక అనుభవం అని చెప్పారు. ఈ స‌మావేశం అనంత‌రం భారత ఆర్థిక వ్యవస్థపై అభిప్రాయం వెల్లడించాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు అభిజిత్ నేరుగా సమాధానం ఇవ్వకుండా ``మా సమావేశాన్ని మీడియాపై ఒక జోక్ వేయడం ద్వారా ప్రధాని ప్రారంభించారు. మీడియా నన్ను మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా ఎలా వలలో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నదో చెప్పారు. ఆయన టీవీ చూస్తారు. మీ అందరినీ గమనిస్తున్నారు. మీరు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారో కూడా ఆయనకు తెలుసు. అందువల్ల ఇక ఆపేయండి`` అని అభిజిత్ పేర్కొన్నారు. త‌ద్వారా త‌న మునుప‌టి భావాల‌ను అభిజిత్ వ్య‌క్తం చేయ‌లేనంత‌గా...మోదీ ఆయ‌న్ను ముగ్దుడిని చేశారు.
ఉద్యోగిస్వామ్యాన్ని సంస్కరించేందుకు తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి మోదీ తనకు వివరించారని అభిజిత్‌ తెలిపారు.``భారత్ ఎంతో ప్రత్యేకమైనదని, ఇక్కడ చాలామంది విధానాల గురించి చెప్తారు తప్ప, వాటి వెనుకనున్న ఆలోచనల గురించి మాట్లాడరు. పరిపాలనా వ్యవస్థను మోదీ ఎలా చూస్తారో చెప్పారు. కొందరు ప్రజల అపనమ్మకం.. పాలనపై ఎటువంటి రంగులు వేస్తుందో తెలిపారు. పాలనా ప్రక్రియపై పట్టు కలిగి ఉండే వ్యవస్థలు ఎలా ఆవిర్భవిస్తాయో చెప్పారు. అది ప్రజల సమస్యలపై స్పందించే ప్రభుత్వం కాద‌ని.. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే అలవాటు అధికారులకు రావాలంటే.. వారిని క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు దగ్గరగా ఉంచాలి అని వివ‌రించారు`` అంటూ బెనర్జీ పేర్కొన్నారు.