నిన్న లక్ష పెట్టుంటే... ఈరోజు 1.25 లక్షలు వచ్చేది !!

August 08, 2020

అసలే వ్యాపారమే లేక చస్తుంటే... ఇదెలా సాధ్యం. నష్టం రాకుంటే చాలురా బాబు లాభం సంగతి దేవుడెరుగు అని అందరూ భావిస్తున్న పరిస్థితి. కానీ ఈరోజు షేర్ మార్కెట్ విపరీతమయిన లాభాలను సంపాదించింది. యూరప్ లో కరోనా తీవ్రత తగ్గుతుండటంతో అక్కడ మార్కెట్లలో ఈరోజు పెరుగుదల కనిపించింది. ఆ జోష్ తో భారతీయ మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. అవి రోజంతా అలాగే కొనసాగాయి. ముఖ్యంగా బ్యాంక్ షేర్లు బాగా లాభపడ్డాయి.

బ్యాంకు షేర్లు ఎంత లాభ పడ్డాయో తెలియాలంటే... ఒక ఉదాహరణ చూద్దాం. ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ ప్రైస్ నిన్న 313తో ముగిసింది. ఆ రేటుతో నిన్న సాయంత్రం లేదా నేటి ఉదయం లక్ష రూపాయలు పెట్టి ఉంటే... సాయంత్రానికి మీ డబ్బుకు పాతిక వేలు లాభమొచ్చేది. ఎందకంటే.. ఈ ఒక్కరోజే ఇండస్ ఇండ్ బ్యాంక్ 25 శాతం పెరిగింది. 391 రూపాయల వద్ద ముగిసింది. అసలు కరోనా అనంతరం ఈ స్థాయిలో మార్కెట్ పెరుగుదల ఎపుడూ కనిపించలేదు. యాక్సిస్ బ్యాంక్ కూడా 20 శాతం లాభాలను తెచ్చిపెట్టింది. మొత్తం మీద మార్కెట్ భారీగా పెరిగింది. 

సెన్సెక్స్ 2476 పాయింట్లు పెరిగి 30067కి చేరుకోగా... నిఫ్టీ  702 పాయింట్లు పెరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ఫార్మా షేర్లు మార్కెట్లను లాభదాయకంగా ముందుకు నడిపించాయి. బ్యాంకులు, ఫార్మా కంపెనీలు ఎక్కువ లాభ పడ్డాయి.