టీవీలు చూడొద్దు... కరోనాను ఇలా భయపెట్టండి

August 04, 2020

తెలుగు టీవీ ఛానెళ్ల హడావుడి చూస్తుంటే.. వేలమంది తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు, ప్రపంచం ఈ నెలలో అంతమైపోతున్నట్లు అతిప్రచారం చేస్ుతన్నారు. వాస్తవానికి కరోనా అనేది చింతించాల్సిన వైరస్ మాత్రమే గానీ... భయపడాల్సిన వైరస్ కాదు. అలాంటపుడు ఎందుకు ప్రభుత్వాలు ఇంత అప్రమత్తం అవుతున్నాయి అంటే... మిగతా రోగాలతో పోలిస్తే ఇది వెంటనే ఇతరులకు పాకుతుంది. జనంలో టెన్షన్ పెరుగుతుంది. అంతమందికి చికిత్స ఇవ్వడం కష్టం కాబట్టి జాగ్రత్తలు ఎక్కువగా చెబుతున్నారు. 

అసలు కరోనాకు ఎందుకు భయపడకూడదో తెలుసుకుందాం.

1. ఇది అనారోగ్యం ఉన్నవారిపై మాత్రమే తన ప్రతాపం చూపగలదు. ఈ వైరస్ సోకినా కూడా ఆరోగ్యవంతులు 15 రోజుల్లో కోలుకోగలరు. అంతవరకు తమ నుండి ఇతరులకు సోకకుండా ప్రత్యేకంగా ఉండాలి.

2. కరోనా వైస్ కణాలు పెద్దవి కావడం వల్ల మాస్క్ లు దొరకడం లేదని బెంగ వద్దు. కర్చీఫ్ కట్టుకున్నా సరిపోతుంది. 

3. కరోనా వైరస్ గాలిలో బతకలేదు. ఏదో ఒక వాహకం ద్వారానే ఇతరులకు చేరుతుంది. గాలి దాని వాహకంగా పనికిరాదు. కరోనా వ్యక్తి తుమ్మినపుడు  3 మీటర్ల కంటే ఎక్కువ దూరంగా అది వెంటనే నేలకు చేరుతుంది. మనకు సోకదు.

4. వస్త్రాలు, ఇతర ఘన పదార్థాలు లోహం మీద కరోనా వైరస్ 12-24 గంటలు మాత్రమే బతకగలదు. కాబట్టి బెంగ లేదు. ఎప్పటికపుడు చేతులు ముందు వెనుక శుభ్రంగా కడుక్కోవాలి. దేన్ని పడితే దాన్ని తాకడం మానేయాలి. 
5. చైనా మనకంటే కోల్డ్ కంట్రీ. కాబట్టి వైరస్ విజృంభించింది. మనది వారి కంటే వేడి కంట్రీ... పైగా ఇది అత్యధిక వేడి ఉండే సమ్మర్. కరోనా మన దగ్గర వేగంగా వ్యాప్తి చందే అవకాశాలు తక్కువ. 28 డిగ్రీల కంటే ఎక్కువ వేడిని ఈ వైరస్ తట్టుకోలేదు. 

6. శానిటైజర్ తో చేతులు తుడుచుకున్నా దీని నుంచి రక్షణ పొందవచ్చు.

7. వేడి నీళ్లు ఎక్కువ తీసుకోండి. సిట్రస్ పదార్థాలు ఎక్కువ తీసుకోండి. చల్లని వాటికి కొంతకాలం దూరంగా ఉండండి.
8. అపుడపుడు, గోరు వెచ్చటి నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి పుక్కిలించండి.  
 

ప్రజల్లో భయాన్ని పెంచొద్దు, అవగాహన కల్పించాలి.