తనఖా లేకుండా కోటి లోను కావాలా?

August 11, 2020

మోడీ స్కీములు మామూలుగా ఉండవు. పైకి మనకోసమే అన్నట్టు ఉంటాయి గాని దానికి వెనుక ప్రభుత్వానికి ఉపయోగపడే ఐడియా ఒకటి ఉంటుంది. తాజాగా మోడీ చిరు వ్యాపారుల కోసం ఓ సంచలన పథకం తేబోతున్నట్టు తెలుస్తోంది. చాలామంది చిరు వ్యాపారులు సరైన సమయానికి డబ్బు అందక వ్యాపారంలో నష్టపోవడం, మూసేయడం కూడా జరుగుతుంది. చిరు వ్యాపారులు ఎంత సమృద్ధిగా ఉంటే సమాజం అంత ఆర్థికంగా అంత ఉత్సాహంగా ఉంటుంది. నగదు లావాదేవీలు కూడా పెరుగుతాయి. పైగా చిన్న వ్యాపారులు పన్నులు, రుణాలు ఎగ్గొట్టరు. కార్పొరేట్లతో పోల్చుకుంటే... ప్రభుత్వానికి వీరి వల్ల క్రమపద్ధతిలో ఆదాయం సమకూరుతుంటుంది. అందుకే వీరిని ప్రోత్సహించడానికి మోడీ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. తనఖా లేకుండా రుణం ఇచ్చే ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

జీఎస్టీ నెలనెల కట్టాలి. కానీ చాలామంది సరిగా కట్టడం లేదు. 3 నెలల తర్వాత కట్టినా ఏం కాదులే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా సీఎలు వీరిని అలా ఎంకరేజ్ చేస్తున్నారు. అది ఇంకెక్కడికో దారితీస్తుంది. అలా కాకుండా వీరి చేత ప్రతినెలా పన్ను కట్టించే ఒక ఐడియా సిద్ధం చేశారు. ఎవరైతే ప్రతినెలా జీఎస్టీ టైంకు కడతారో వారికి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు లోను మంజూరు చేస్తారు. తనఖా అవసరం లేదు. అయితే, వరుసగా ప్రతినెలా క్రమం తప్పకుండా జీఎస్టీ కట్టిన వారే దీనికి అర్హులు. 

ఈ పథకం వల్ల ప్రభుత్వం ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. లోను కోసం అయినా కొందరు జీఎస్టీ కట్టే అలవాటు చేసుకుంటారని కూడా కేంద్రం భావిస్తోంది. దీనికి జీఎస్టీ ఎక్స్ ప్రెస్ స్కీమ్ అని పేరు పెట్టారు. కేంద్రం ఆమోదం తర్వాత ఇది అమల్లోకి వస్తుంది.