ఆధార్ తో పాన్ లింకు లాస్ట్ వార్నింగ్

August 09, 2020

ఆధార్ తో పాన్ లింకు చేసుకునే విషయంలో తుది హెచ్చరికను జారీ చేసింది ఐటీ శాఖ. ఆధార్ నెంబరుతో పాన్ నెంబరునుఅనుసంధానం చేయాలని మొదట్నించి చెబుతున్నా.. పలువురు ఇప్పటికి లింకు చేసుకున్నది లేదు. ఆధార్ తో పాన్ లింకు తప్పనిసరి అని స్పష్టం చేసిన తర్వాత కూడా చాలామంది ఈ పని చేయలేదు.
దీంతో.. ఈ అంశంలో తుదిగడువును మార్చి 31కు నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 139ఏఏ (2) ప్రకారం .. 2017 జులై ఒకటో తేదీ వరకు జారీ చేసిన పాన్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయటం తప్పనిసరి అని తేల్చారు.
తాజాగా తాము ఇచ్చిన తుది గడువు (మార్చి 31) నాటికి ఆధార్ తో పాన్ లింకు చేసుకోకుంటే పాన్ కార్డును ఇన్ ఆపరేటివ్ చేస్తామని తేల్చారు. ఇప్పటివరకూ ఉన్న డేటా ప్రకారం దగ్గర దగ్గర 17.58 కోట్ల పాన్ కార్డులు ఆధార్ తో అనుసంధానం కాలేదు. మరిన్ని కార్డులు నెలన్నరలో లింకు అవుతాయంటారా?