టీడీపీకి... వైసీపీని ఎదుర్కొనే శక్తి, నెట్ వర్క్ ఉన్నాయా?

May 24, 2020
CTYPE html>
ఇన్ని అరాచకాల తర్వాత కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న వైసీపీ నేతల ధైర్యాన్ని, మొండితనాన్ని చూసి ఏపీ జనం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు...భవిష్యత్తుపై తీవ్రమైన బెంగతో ఉన్నారు. వైసీపీలో ఉంటే జీవితం లేకుంటే నరకం అని భయభ్రాంతులకు గురిచేసే స్థాయిలో వైసీపీ నేతలు మాట్లాడటం సాధారణమైన విషయం కాదు.  వాస్తవానికి పల్నాడు అరాచకాలు దేశ వ్యాప్తంగా హైలైట్ కావడం, ఆ తర్వాత పడవ ప్రమాదం జరిగి సుమారు 30 మంది చనిపోవడం, ఆ తర్వాత కోడెల ఆత్మహత్య చేసుకోవడం వంటి వరుస ఘోరాల తర్వాత కూడా వైసీపీలో ఏం భయం లేదు. ప్రజలు ఏమైనా అనుకుంటారేమో, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తమను ఓడిస్తారేమో, కేంద్రం ఏమైనా అంటుందేమో, చర్యలు తీసుకుంటుందేమో అన్న కించిత్ భయం కూడా వైసీపీ నేతల్లో లేకపోవడం ఆశ్చర్యాలకే ఆశ్చర్యం కలిగించే అంశం. 
  • జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు పడవ ప్రమాద బాధితులకు 25 లక్షలు డిమాండ్ చేసిన జగన్ పది లక్షలే ఇచ్చాడు. 
  • వైసీపీలో కొనసాగుతూ గతంలో క్రిమినల్ కేసు నమోదై ఉన్న కంచేటి సాయి అనే వ్యక్తి కోడెల కొడుకుపై కేసుపెట్టాడు
  • ఎవరు తప్పులు చేయమన్నారు... ఎవరు చచ్చిపోమన్నారు అని మంత్రి పిల్లి సుభాష్ అన్నారు
  • తెలంగాణ ప్రభుత్వం పూర్తి దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలి అని ఏపీ మంత్రి ఒకరు అన్నారు
  • చనిపోవడానికి ముందు చాలాసేపు కోడెల ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు.. దానిని నిగ్గుతేల్చాలి - అంబటి రాంబాబు
  • మరణాన్ని రాజకీయం చేయొద్దు - గడికోట శ్రీకాంత్ రెడ్డి. 
  • గుండెపోటు అయితే కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్తారా అని బొత్స అన్నారు 
(నోట్ - ఏ డాక్టరైనా ముందు ఎంబీబీఎస్ చదవాల్సిందే, బసవతరాకం ఆస్పత్రి కోడెల చేతుల మీదుగా పుట్టి, విస్తరించింది. ఇప్పటికీ కోడెలకు కీలక పాత్ర ఉంది. అందుకే ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు)
 
చంద్రబాబు స్వయంగా సీబీఐ విచారణను డిమాండ్ చేసినా కూడా ఇవి వైసీపీ ఎదురుదాడికి సంబంధించి కొన్ని ఉదాహరణలు. పై వ్యాఖ్యలు చదివిన ఎవరైనా... చంద్రబాబు విచారణ వద్దనుకుంటున్నారేమో అన్న భావన కలిగించే ఉద్దేశంతో వారు చంద్రబాబు స్వయంగా అడిగాక కూడా విచారణ గురించి ఇలా వాదిస్తారు. ప్రభుత్వంలో ఉండి విచారణకు డిమాండ్ చేసే ఆలోచన విధానం ఒక వ్యూహం. 
 
అసలు వైసీపీ కొద్ది వారాలుగా కోడెలను ఎలా టార్గెట్ చేసిందో ఏపీ ప్రజలే కాదు... రోజూ తెలుగు టీవీలు చూసే తెలంగాణ ప్రజలకు తెలుసు. వైసీపీ ప్రభుత్వం గాని, వైసీపీ ఎమ్మెల్యేలు గాని కోడెలను ఎంత అవమానించి ఎంత టార్గెట్ చేసిందీ తెలుసు. ఇవన్నీ తెలిసినా... కోడెల మరణానికి ప్రభుత్వ టార్చర్ అని తెలిసినా... వైసీపీ నేతలు సొంత మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసి డిఫెండ్ చేసుకుంటున్నారంటే... ఇలాంటి వారితో కూడిన పార్టీని ఎదుర్కోవడానికి కేవలం చంద్రబాబు శక్తి సరిపోదు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజేమోనేమో అనిపిస్తుంది. ఎందుకంటే... అబద్ధాలను చాలా కన్ స్ట్రక్టివ్ గా జనాల్లోకి చొప్పించగలిగిన నేర మేధోతనంతో పాటు పార్టీ పట్ల అపార వినయవిధేయతలు కలిగిన ఒక బలమైన సైన్యం వైసీపీకి ఉంది. 
ఈ వైసీపీ టీం ఎలా పనిచేస్తుందంటే... ముందు అలా మెరుపులా ఒక వార్తను తన అనుకూల మీడియాలో ప్రసారం చేస్తారు. దానిని సోషల్ మీడియాలోకి వెళ్లిన వెంటనే అనుకూల మీడియాలో ప్రచారం చేయడం ఆపేస్తారు. మళ్లీ కొంత సేపటి తర్వాత సోషల్ మీడియాలో ఇలా అనుమానాలు వ్యక్తంచేస్తున్నారని కొత్తగా అపుడే ప్రచారం చేసినట్టు జనాల్ని నమ్మించగలిగిన ఒక క్రిమినల్ ఆలోచనా విధానం అసాధారణం. చంద్రబాబు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆలోచనా విధానంతో ఇలాంటి వ్యూహాత్మక గెరిల్లా ప్రచారాన్ని ఎదుర్కోవడం నిజంగా కష్టమే. ఇపుడు టీడీపీకి ఉన్న వనరులు వైసీపీని కంట్రోల్ చేయడానికి గాని, ఎదుర్కోవడానికి గాని డిఫెండ్ చేసుకోవడానికి కాని సరిపోవు. కచ్చితంగా కొత్త విధానం, ఒక నిర్మాణాత్మకంగా పనిచేసే బృందం... అది కూడా లాయల్టీ నిలువెల్లా ఉన్న వ్యక్తులు టీడీపీ టీంలో చేరి నిరంతరం పనిచేస్తేనే ఇది సాధ్యం. లేకపోతే టీడీపీ నిలదొక్కుకోవడం అంత సులువైతే కాదు. ప్రస్తుత బలంతో వైసీపీ ఆలోచనా విధానాన్ని అందుకోవడం, వారిని అధిగమించడం అంత సులువు కాదు... అంత నెట్ వర్క్ కూడా ఇప్పుడు అయితే టీడీపీకి లేదు. మరి భవిష్యత్తులో ఎలాంటి వ్యూహంతో టీడీపీ ముందుకు వెళ్తుందో చూడాలి.  

Read Also

మైండ్ బ్లోయింగ్.... కోడెలను ఇరికించిన కేసుల భారీ లిస్టు ఇదే !
ఆంధ్రోళ్లపై జగన్ దెబ్బ - టీటీడీ జాతీయం
పవన్‌లో ఒక నిజమైన నాయకుడు కనిపించిన వేళ..