ఎగ్జిట్ పోల్ వెనుక 5 లక్షల కోట్ల బిజినెస్ !!

July 12, 2020

వార్త చదవడానికి ముందు మీకు ఒక క్లారిఫికేషన్. ఈ నాలుగు లక్షల కోట్లు బెట్టింగ్ గురించి కాదు. మరి దేనికి అనే కదా మీ అనుమానం. గత పది రోజులుగా అంతర్జాతీయ కారణాల వల్ల స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఎంత కుప్పకూలింది అంటే 2008 మహాపతనం అంత కుప్పకూలింది. అయితే, దీనికి కారణాలు రాజకీయం కాదు. అంతర్జాతీయ నిర్ణయాలు. ఈ పదిరోజుల్లో సుమారు 5 లక్షల కోట్ల విలువను ఇన్వెస్టర్లు నష్టపోయారు. దీని నుంచి బయట పడటం ఎలాగో వారికి అర్థం కానిపరిస్థితి. బేర్ మార్కెట్లో దిగ్గజ షేర్ల నుంచి చిన్న షేర్ల వరకు అన్నీ పతనం అయ్యాయి. ఆ సమయంలో కార్పొరేట్లకు వచ్చిన టైమింగ్ ఐడియా ....ఎగ్జిట్ పోల్స్.
ప్రస్తుతం దేశంలో మోడీకి గతంలో ఉన్నంత సానుకూలత లేదు. మళ్లీ గెలుస్తాడో లేదో తెలియదు. అసలే మార్కెట్ తీవ్రంగా పతనం అయ్యి ఉంది. ఈ టైంలో మోడీకి నెగెటివ్ గా ఫలితాలు వస్తే... మార్కెట్ సర్వ నాశనం అవుతుంది. అందుకే కార్పొరేట్లు ఎగ్జిట్ పోల్ తో భారీ గేమ్ ఆడాయని ఆరోపణలు వినిపించాయి.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28వ వర్ధంతికి నివాళి అర్పించడానికి విజయవాడ వచ్చిన తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రస్తావన తెచ్చారు. ఈ ఎగ్జిట్ పోల్స్ 5.33 లక్షల కోట్ల కుంభకోణమని అన్నారు. ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీకి ఆర్ధిక సాయాన్ని అందించిన కార్పొరేట్ సంస్థల షేర్లను పెంచడం కోసమే ఈ ఎగ్జిట్ పోల్స్ ను వాడుకున్నారని ఆయన ఆరోపించారు.
ఇది ఒకరకంగా నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే... మోడీ వేవ్ భారీగా ఉన్నప్పటి కంటే ఇపుడు ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. వాస్తవానికి మోడీ ప్రభ తగ్గిన నేపథ్యంలో ఈ ఫలితాలు వచ్చే సమస్యే లేదు. అలాంటపుడు కార్పొరేట్లు ఒక కొత్త ఐడియా వేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ను వాడుకుని బీజేపీ గెలుస్తుందని చెప్పిస్తే మార్కెట్ పెరుగుతుంది. ఇది వారికి తెలుసు. అందుకే అలా చేశారేమో అని ఆరోపణలు వినిపిస్తుండగా ఒక్క రోజులోనే షేర్ మార్కెట్ 5 లక్షల కోట్లు విలువ పెంచుకుంది. ఇది కేవలం ఎగ్జిట్ పోల్ పలితాల వల్ల. మళ్లీ పెరిగిన సంపదను ఇన్వెస్టర్లు కార్పొరేట్లు సొమ్ము చేసుకున్నారు. దీంతో మరుసటి రోజే మార్కెట్ పడింది. ఇదంతా చూస్తుంటే.... ఈ సారి అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గాడి తప్పేలా ఉన్నాయి. కార్పొరేట్లు, ఇన్వెస్టర్ల డ్రీమ్ అయితే నెరవేరింది.