మహేష్ భారీ కటౌట్ వెనుక సీక్రెట్ ఉందా?

May 26, 2020

తరం మారింది. వారి ఆలోచనలు కూడా మారాయి. రూపాయి మనకు ఎలా వస్తుందా అని ఆలోచించే వాళ్లే అందరూ. అంతేగాని రూపాయి పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. కావాలంటే... గంటలు గంటలు సోషల్ మీడియాలో కూర్చుని సొల్లు కబుర్లు చెబుతారు గాని హీరోకోసం ప్రాణమివ్వరు. అలా ఇచ్చేలా అయితే... పవన్ లాంటి క్రేజున్న వ్యక్తి రెండు చోట్ల ఓడిపోరు. గతంలో సినిమాలకు కటౌట్లు కట్టేసంప్రదాయం బాగా గట్టిగా ఉండేది. అభిమానులు వాటికోసం ఎంతకయినా తెగించేవారు. కానీ ఇపుడు అంత గుడ్డి ఫ్యాన్స్ ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో మహేష్ కి రాబోయే సినిమా కోసం 81 అడుగుల కటౌట్ సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటుచేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇది అభిమానులు ఏర్పాటుచేసిన కటౌటా నిర్మాతలు ఫండింగ్ చేసిన కటౌటా అని గుసగసలు వినిపిస్తున్నాయి.

నిర్మాతలు కటౌట్ ఏర్పాటుచేయడం అన్నది గతంలో జరిగేది కాదు. కానీ ప్రస్తుత తరానికి తగ్గట్టు అభిమానులు ముందుకురానపుడు బజ్ క్రియేట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే అభిమానుల పేరిట నిర్మాతలే కటౌట్ ఏర్పాటుచేసినట్లున్నారని... కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కటౌట్ ను నిర్మాత అనిల్ సుంకర ట్విట్టరులో షేర్ చేశారు. కాకపోతే.... ఆయనేమీ ఏర్పాటుగురించి వ్యాఖ్యానించలేదు. నిర్మాత పెట్టించినా, అభిమానులు పెట్టించినా ఇతరులకు దాని వల్ల ఏ నష్టమూ లాభమూ లేదు గాని మారుతున్న కాలంలో ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటుచేయడాన్ని బట్టి ఈ అనుమానాలు అంతే. 

మహేష్ కటౌట్ ఒకటేనా మిగతా హీరోల పరిస్థితి ఏంటి మరి అనుకుంటారేమో. అందరి అభిమానులు స్వార్థపరులే. అందుకే పెద్ద హీరోది అయినా చిన్నహీరోది అయినా సినిమా బాగుంటేనే ఆడుతుంది. సినిమా బాలేకపోతే 150 పెట్టి సినిమాకు రాని అభిమాని విచ్చలవిడిగా భారీ అమౌంట్లుపెట్టి కటౌట్లు వేస్తారా అన్నదే ప్రశ్న. అది ఏ హీరోకి అయినా సరే.