హీరో రామ్ కి ఇంత క్రేజా... అదీ ఓటీటీలో !

August 07, 2020

థియేటర్లు ఆగం అయ్యాయి. కరోనా దెబ్బకు 2020లో అవి తెరచుకుంటాయన్న గ్యారంటీ కూడా లేదు.

ఈ నేపథ్యంలో చిన్నసినిమాలతో పాటు కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓపిక పట్టలేకనో, క్రేజు తగ్గుతుందనో, అప్పులు పెరిగిపోతాయనో ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు.

దీంతో ఓటీటీ వాళ్లు కూడా కొన్ని సినిమాలకు ఆఫర్లు ఇస్తున్నారు. అలా తాజగా హీరో రామ్ కు భారీ ఆఫర్ వచ్చింది. 

పూరీతో తీసిన ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచింది.

అందులో పూరి టాలెంట్ కంటే రామ్ టాలెంటే ఎక్కువ కనిపించింది.

దీంతో అతని తదుపరి సినిమా రెడ్ (RED) కి మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఇప్పటికే పూర్తయిన ఈ సినిమాకు ఓటీటీ నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి.

ఒకరు 25 కోట్లకు అడగ్గా... మరొకరు మాకిస్తే 30 కోట్లు ఇస్తామన్నారట.

అయితే, ఓటీటీలో ఆ సినిమా విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. థియేటర్లో అయితే సినిమా హిట్టయినా ఫ్లాపైనా ఒక క్రేజ్ ఉంటుంది.

ఓటీటీలో ఫ్లాఫైతే కనీసం చర్చ కూడా జరగదు. హిట్టయితే ఈజీగా పైరసీ అయిపోతుంది. థియేటర్లో హిట్టయితేనే డబ్బులు ఎక్కువ వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు.

అందుకే థియేటర్లు ఓపెనయ్యే వరకు ఆగుతున్నారు.

ఎనర్జిటిక్  హీరో  రామ్ తాజా చిత్రం 'రెడ్'కు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. 

మాళవిక శర్మ హీరోయిన్. సొంత బ్యానర్లోనే తీశారు. స్రవంతి రవికిషోర్ నిర్మించారు. మణిశర్మ దీనికి సంగీతం అందించారు.