బీఎస్ఎన్ఎల్ పంట పడింది

July 04, 2020

కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అరె ఇంత కాలం ఇలా ఎందుకు ఆలోచించలేదు అనిపిస్తాయి. అలాంటి సర్ ప్రైజే బీఎస్ఎన్ఎల్ స్వచ్ఛంద పదవీ విరమణ ఆలోచన. లక్షన్నర మంది ఉద్యోగులుండే బీఎస్ఎన్ఎల్ ప్రస్తుత నష్టాల్లో ఉందట. దీనిని ఏం చేయాలా అని గవర్నమెంటు ఆలోచిస్తోంది. ఈ నేపథ్యలో గవర్నమెంటుకు ఒక ఐడియా వచ్చింది. వీఆర్ఎస్ ఇచ్చి చూద్దాం ఎంత మంది తీసుకుంటారో అని.... అంతే... ప్రకటించిన రెండ్రోజులకే కుప్పలుతెప్పలుగా అప్లికేషన్లు వచ్చేశాయి. నవంబరు 5 నుంచి రెండ్రోజుల్లోపే 22 వేల మంది మేము వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోతాం పంపించేయండి అని దరఖాస్తులు పెట్టారు. లక్షన్నర మంది లక్ష మందికి వీఆర్ఎస్ అకాశం ఉంది. ఓవరాల్ గా ఒక పాతిక శాతం మంది అడుగుతారేమో అని ప్రభుత్వం ఆలోచించింది. ఆశ్చర్యకరంగా రెండ్రోజుల్లోనే 22 వేల మంది అడిగారు. 

తాజా అంచనాల ప్రకారం అయితే... సుమారు 70 వేల మందికి పైగా వీఆర్ఎస్ తీసుకునే అవకాశాలున్నాయట. అపుడు బీఎస్ఎన్ఎల్ కు నెలనెలా 7 వేల కోట్లు కేవలం జీతాల రూపంలోనే ఆదా కానుంది. ఇదిలా ఉంటే... వీరు ఇంత ఎగబడటానికి వీఆర్ఎస్ ప్యాకేజీ కూడా బాగుండటమే కారణం. వీఆర్ఎస్ తీసుకున్న వారికిచ్చే ప్యాకేజీ వివరాలివే.

ఇంతవరకు గడిచిన ఉద్యోగ సంవత్సరాలు లెక్క గట్టి ఏడాదికి 35 రోజులు చొప్పున శాలరీ ఇస్తారు. 

ఇంకా మిగిలి ఉన్న సర్వీసుకు సంబంధించి ఏడాదికి 25 రోజుల శాలరీ లెక్కగట్టి ఇస్తారు. 

ఉదాహరణకు ఒక వ్యక్తి 32వ సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ లో చేరాడనుకుందాం. ఇపుడు అతనికి 50 ఏళ్లు అనుకుందాం. ఈ లెక్కన అతను వీఆర్ఎస్ తీసుకుంటే... 18 x 35 రోజులు జీతం లెక్క గట్టి ఇస్తారు అలాగే మిగిలిన 8 ఏళ్ల సర్వీసుకు... 8 x 25 రోజులు లెక్కగట్టి ఇస్తారు. ఇలా చూసుకుంటే... ప్రతి ఒక్కరికీ పది లక్షల ఆదాయం వస్తుంది. అందుకే వాటితో ఏ ఇన్వెస్ట్ మెంట్లో చేసుకుని... ఇంకో ఉద్యోగం వెతుక్కుంటే బాగుంటుందని కొందరు. పిల్లలు సెటిలయ్యారు. ప్రశాంతంగా బతుకుదాం అని కొందరు వీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా... ఇలాంటి ఆలోచన నాలుగైదేళ్ల కింద చేయలేకపోయామో అని గవర్నమెంటే ఫీలయ్యే పరిస్థితి. త్వరలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం, ప్రైవేటీకరణ భయం కూడా ఉద్యోగులు వీఆర్ఎస్ కు మొగ్గు చూపడానికి కారణమై ఉండొచ్చు. ఏది ఏమైనా... రెస్పాన్స్ మాత్రం అదిరింది.