ఈ ఫొటో చెప్పేసింది - ఏపీలో గెలుపెవ‌రిదో !!

July 20, 2019

బియ్యం ఉడికాయో లేదో చెప్ప‌డానికి ఒక్క మెతుకు చాలంటారు.
ఏపీ ఓట‌రు మ‌న‌సులో ఎవ‌రున్నారో చెప్ప‌డానికి ఈ ఒక్క ఫొటో చాలు.
అభిమానం, ఆప్యాయ‌తో డ‌బ్బుతో కొనేవి కావు... అవి గుండెల్లోంచి చీల్చుకుని బ‌య‌ట‌కు త‌న్నుకువ‌స్తాయి. అంతా తానై ప్ర‌చారంలో దూసుకుపోతున్న చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌న్ను సీఎం చేయండి అని అడ‌గ‌డం లేదు. ఇంత‌కాలం ఏపీకి కూలీగా ప‌నిచేశాను. నా శ్ర‌మ‌కు కూలీ ఇవ్వండి అని అడుగుతున్నాడు. మీ భ‌విష్య‌త్యును నా భుజ‌స్కంధాల‌పై మోస్తాను.. ఆ బాధ్య‌త‌ను నా మీద పెట్టండి అంటున్నాడు.
సీఎం చేయండి మీరు అడిగింది ఇస్తాను... అన్న‌మాట‌కు
నామీద న‌మ్మ‌కం ఉంచండి, మీ భ‌విష్య‌త్తును నిర్మిస్తాను... అన్న మాట‌కు ఎంత తేడా ఉందో క‌దా.
ఇక చాలామంది ఏపీలో ఆ పార్టీ గాలి, ఈ పార్టీ గాలి అని ర‌క‌ర‌కాలుగా చెబుతున్నారు. త్రికోణ పోటీలో ఎవ‌రు ఎవ‌రి చేతిలో దెబ్బ‌తింటారో చెప్ప‌లేం అంటున్నారు. కానీ ఎందుకో ఎవ‌రూ అడ‌క్క‌పోయినా, ఎవ‌రూ చెప్ప‌క‌పోయినా మ‌న‌స్ఫూర్తిగా క‌లిసిన ఆ రెండు చేతులు ఏపీ ప‌ల్స్ ఏంటో చెప్పేస్తున్నాయి. భ‌విష్య‌త్తులో గెలుపు ఎవ‌రిదో తేల్చేస్తున్నాయి. గ‌తంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన స‌భ‌లు చూశాం గానీ... అందులో ఎగ‌బ‌డే వారినీ చూశాం గానీ... ఈ చిత్రం మాత్రం ఒక న‌మ్మ‌క‌మైన స‌ర్వే క‌న్నా స్ప‌స్టంగా భ‌విష్య‌త్తు ఫ‌లితాల‌ను చెబుతోంది అనిపిస్తోంది.
ఆ ఫొటో ఒక్క‌టే చాలదు అనిపిస్తే ఇవి కూడా చూసి చెప్పండి.