అరుదైన సీను - టాప్ క్లాస్ వినయం 

August 13, 2020

కొందరికి చిన్న విజయం వస్తేనే తట్టుకోలేరు. విజయం అనేది హార్డ్ వర్క్, ప్లానింగ్, సిట్యువేషన్స్, లక్  వీటన్నింటి కాంబినేషన్. మన గౌరవం మన వినయం నుంచే వస్తుంది. నీవు ఇతరులకు చేయలేనిది ఇతరులు కూడా నీకు చేయకుండా ఉండటానికి అవకాశం ఉంది కదా. తాజాగా ఒక బిలియనీర్ మరో బిలియనీర్ కాళ్ల మీద పడి నమస్కరించడం ఎంతో మంది మనసులను తాకింది. రతన్ టాటా... ఇండియాకు ప్రతిష్టను తెచ్చిన కంపెనీల్లో ఒకటి. ఆ కంపెనీ తయారుచేయని ప్రొడక్టే లేదు. ఇన్ఫోసిస్ కంపెనీ ఐటీ దిగ్గజం. భారత సత్తాను ప్రపంచానికి చాటి... ఆధునిక వృత్తుల్లోనూ భారత్ కింగ్ అని నిరూపించిన కంపెనీ. వీరిద్దరు ఎవరూ ఎవరికీ తీసిపోరు. కానీ ఇద్దరు ఒదిగి ఉన్నారు. ఎంత ఒదిగి ఉన్నారంటే.. కార్పొరేట్ వర్గాన్నే ఆశ్చర్యపరిచిన ఒక దృశ్యాన్ని ఈ ఇద్దరు ఆవిష్కరించారు.

ట్రైకాన్ అవార్డుల కార్యక్రమం నిన్న ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు దిగ్గజాలకు అవార్డులు ప్రధానం చేశారు. దేశ వ్యాప్తంగా పెద్ద కార్పొరేట్లు దీనిక ిహాజరయ్యారు. ఈ సందర్భంగా రతన్ టాటాకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును నారాయణ మూర్తి చేతుల మీదగా అందజేశారు. దశాబ్దాలుగా ఈ దేశానికి ఒక దారి చూపిన కంపెనీ అధినేతకు నేను అవార్డు ఇవ్వడం చిన్నబుచ్చడం అవుతుందనుకున్నారో ఏమో .. నారాయణ మూర్తి గారు ఆ వెంటనే రతన్ టాటా కు పాదాభివందనం చేశారు. ఆయన పాదాభివందనాన్ని మరింతగా హృదయానికి తీసుకున్న రతన్ టాటా... గొప్ప స్నేహితుడు అయిన నారాయణ నుంచి ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని.. ఆయన విలువను పెంచారు. అసలు ఇంత ఒద్దిక, మర్యాద...వారిద్దరి స్పందన ఈ దేశాన్నే ఆకట్టుకుంది.