టీఆర్ఎస్‌కు ఆ మూడు కులాల టెన్ష‌న్‌..

February 22, 2020

తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాల అస్త్రశస్త్రాలను లైన్లో పెట్టేస్తున్నారు. తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న కులాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు సైతం అదే కులానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కులానికి చెందిన ఓటర్లను టీఆర్ఎస్ వైపు మళ్ళించేలా చేయాలని కేసీఆర్ టార్గెట్ పెట్టారు. కెసిఆర్ టార్గెట్ ఎలా ఉన్నా ? ఈ నియోజకవర్గంలో మూడు ప్రధాన సామాజిక వర్గాల టెన్షన్ మాత్రం టిఆర్ఎస్‌కు పట్టుకుంది.
ఈ మూడు సామాజిక వర్గాలు తమ పార్టీకి ఎంత వరకు సపోర్ట్ చేస్తాయ‌న్న సందేహాలు ఆ పార్టీ నేతలకు ఉన్నాయి. హుజూర్‌న‌గర్ లో టిఆర్ఎస్ కు మాదిగ సామాజిక వర్గం దెబ్బ తప్పదనే టాక్ బలంగా వినిపిస్తోంది. మాదిగలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్ తీర‌ని అన్యాయం చేస్తున్నారని ఆ సామాజికవర్గం నేతలు మండిపడుతున్నారు. రెండోసారి కెసిఆర్ అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో మాదిగలకు చోటు ఇవ్వలేదు. తాజాగా జరిగిన విస్త‌ర‌ణ‌లోనూ ఆ సామాజికవర్గాన్ని అస్సలు పట్టించుకోలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను సైతం కెసిఆర్ గత ప్రభుత్వంలో బర్తరఫ్ చేయడం పైనా ఆ సామాజికవర్గం నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
తెలంగాణలో ఉన్న మాదిగ మాదిగ ఉప కులాలను కెసిఆర్ పట్టించుకోకపోవడంతో హుజూర్‌న‌గర్ లో ఆ సామాజిక వర్గం టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఖ‌చ్చితంగా గా మ‌ద్ద‌తు ఇవ్వ‌ద‌నే అంచ‌నాలు ఉన్నాయి.
ఇక రెడ్డి సామాజిక వర్గం విషయానికి వస్తే కెసిఆర్ ఈ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తొలిసారి సీఎం అయినప్పటి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి మిగిలిన అన్ని సామాజిక వర్గాల కంటే పెద్ద పీఠ వేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్లో ఆరుగురు రెడ్డి మంత్రులు ఉండటం కూడా ఇందుకు నిదర్శనం. అయితే ఓవరాల్‌గా కేసీఆర్ రెడ్డి సామాజిక వర్గానికి పైపై మెరుగుల‌తో సంతృప్తి ప‌రుస్తున్నా... అంత‌ర్గ‌తంగా తొక్కి పెడుతున్నారన్న అభిప్రాయం ఆ సామాజిక వర్గానికి చెందిన యువతతో పాటు  మధ్యతరగతి ప్రజల్లో ఉంది. దీంతో వారంతా కేసీఆర్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.
ఈ క్రమంలోనే వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీని ముందు నుంచి విపరీతంగా అభిమానించే కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా తన వైపునకు తిప్పుకునేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హుజూర్‌న‌గర్లో ఈ సామాజికవర్గ ఓటర్లు 22 వేలకు వేల వరకు ఉన్నారు. టిడిపి ఇప్పుడు ఇదే వ‌ర్గానికి చెందిన‌ కిరణ్మయిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు కేసీఆర్ ఈ వర్గానికి చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు.. మరో నలుగురు ఎమ్మెల్యేలను ఇక్కడే మోహరించింది. ఏదేమైనా ఈ మూడు సామాజిక‌వ‌ర్గాల ఓట‌ర్ల తీర్పు ఎలా ఉంటుందో ? అన్న టెన్ష‌న్ కేసీఆర్‌కు ఉన్న‌ట్టే తెలుస్తోంది.