హుజూర్ న‌గ‌ర్‌లో గులాబీకి స‌మ్మె సెగ‌...!

April 03, 2020

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీపై తీసుకున్న క‌ఠిన వైఖ‌రి ఇప్పుడు దుమారం రేపుతున్న త‌రుణంలో ఈ ఎఫెక్ట్ హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల‌పై ప‌డ‌నున్న‌దా..?  ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుని ఉపపోరులో గెల‌వాల‌న్న కేసీఆర్ ల‌క్ష్యం ఆర్టీసీ స‌మ్మెతో గండి ప‌డ‌నున్న‌దా..?  సీఎం కేసీఆర్ ఆర్టీసీ స‌మ్మెను అణిచివేయాల‌ని, ఉద్యోగుల‌ను తొల‌గించాల‌ని తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ స‌ర్కారుపై అగ్ర‌హవేశాలు వ్య‌క్తం అవుతున్నంగా ఈ ప్ర‌భావం హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోను ప్ర‌తిభింభించ‌నున్న‌ద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  .
సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్‌లో ఇప్పుడు ఉప ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. పీసీపీ అధ్య‌క్షుడు, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో హుజూర్‌న‌గ‌ర్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈనెల 21న ఉప ఎన్నిక జ‌రుగుతోంది. హుజూర్‌న‌గ‌ర్‌లో వ‌రుస‌గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గెలుస్తూ వ‌స్తున్నారు. గ‌తంలో తెలంగాణ కోసం వీర‌మ‌ర‌ణం పొందిన శ్రీ‌కాంత చారి త‌ల్లి శంక‌ర‌మ్మ టీఆర్ఎస్ నుంచి  పోటీ చేసి ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో శానంపూడి సైదిరెడ్డి పోటీ చేసి  ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేతిలో కేవ‌లం 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో కూడా టీ ఆర్ఎస్ఎస్ పార్టీ సైదిరెడ్డిని నియ‌మించింది. కాంగ్రెస్ నుంచి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి పోటీ చేస్తున్నారు. ఈ పోరు అటు కాంగ్రెస్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఎలాగైనా త‌మ సిట్టింగ్ సీటు నిల‌బెట్టుకోవాల‌ని పీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సీటును గెలిచి కాంగ్రెస్‌పై పైచేయి సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించి పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి గ‌ట్టి షాక్ ఇవ్వాల‌ని భావించి, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన సైదిరెడ్డినే పోటీ చేయిస్తుంది. సైదిరెడ్డికి ఓడిపోయిన సానుభూతి ఉంటుందని గులాబీ బాస్ భావించి ఆయ‌న‌కే టికెట్ ఇచ్చారు. ఈ సీటును కైవ‌సం చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ప‌లువురు మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.
ఇప్ప‌టికే టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిఫ‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓసారి ప్ర‌చారం చేసి వ‌చ్చారు. ఇక జిల్లా మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి అక్క‌డే మాకాం వేసి మ‌రి ఎన్నికల ప్ర‌చారం సాగిస్తున్నారు. దీనికి తోడు ప్ర‌తి గ్రామానికి, మండ‌లానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌ను, నేత‌ల‌ను ఇంచార్జీలుగా నియ‌మించారు. ప్ర‌తి ఇంటిని టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు జ‌ల్లెడ ప‌డుతున్నారు. రెండు పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్న త‌రుణంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం రాజ‌కీయంగా హుజూర్‌న‌గ‌ర్ లో కాక‌పుట్టిస్తుంది.
ఎలాగైనా గెల‌వాల‌నుకున్న టీఆర్ఎస్‌కు కేసీఆర్ ఆర్టీసీపై తీసుకున్న నిర్ణ‌యంతో గులాబీ అభ్య‌ర్థి గెలుపుపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎన్నిక‌ల‌  ఫ‌లితాన్నిఇది ఎలా ప్ర‌భావితం చేస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఎన్నిక‌ల్లో ఆర్టీసీ కార్మికులు, ప్ర‌భుత్వ ఉద్యోగ కార్మికులు త‌మ ప్ర‌తాపాన్ని,  ఆగ్ర‌హాన్ని చూపుతారా ? అన్న‌ది తేలాల్సి ఉంది.