ఆర్టీసీ మీద పగ తర్వాత... సిటీలో దీని సంగతి చూడు కేసీఆర్

November 15, 2019

ఇప్పుడు హైద‌రాబాద్ నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంది. హైద‌రాబాద్‌ను దేశానికి రెండో రాజ‌ధాని చేయాల‌ని కేంద్రం ప్ర‌య‌త్నం చేస్తుందని, అందుకు కేంద్రం ముంద‌డుగు వేస్తుంద‌ని ఓవైపు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు హైద‌రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి బీజేపీ ప‌ట్టు సాధించాల‌ని చూస్తుంద‌ని, బీజేపీ అటు వైపు అడుగులు వేస్తుంద‌ని ప్ర‌చారం సాగుతుంది. ఈ రెండింటితో హైద‌రాబాద్ నిత్యం చ‌ర్చ‌నీయాంశంగా మారుతుండ‌గా ఇప్పుడు మ‌రో ఉప‌ద్ర‌వం హైద‌రాబాద్‌ను ముంచుకు రాబోతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.  ద‌క్షిణ భార‌తంలోనే ప్ర‌దాన‌ కేంద్రంగా ఉన్న హైద‌రాబాద్ కు  ఇప్పుడు రాబోతున్న ప్ర‌మాదం తో ఢిల్లీ త‌ర‌హా లో ఉండ‌బోతుంద‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.

ఇంత‌కు హైద‌రాబాద్ ఎదుర్కోబోతున్న ప్ర‌మాదం ఏంటంటే కాలుష్య ప్ర‌మాదం. ఇప్ప‌టికే దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్య‌న‌గ‌రంగా మారిపోయి జ‌నం బ‌తుక‌లేని స్థితికి వ‌చ్చింది. ఈ ప‌రిస్థితి మ‌రికొంత కాలంలో హైద‌రాబాద్‌కు రాబోతుందని విశ్లేష‌కుల అభిప్రాయం. ఇప్పటికే ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గాలి కాలుష్యం 400 పీపీఎంకు పైగా చేరుకోవడంతో అక్కడి ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే వణికి పోతున్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వమూ హెచ్చరిస్తోంది. కాలుష్య తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

మొత్తంగా విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యంతో అక్కడి ప్రజలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బయటకు వెళ్తే చాలు.. కళ్లు, ముక్కులు ఒకటే మంట. అలర్జీతో అనేక సమస్యలు. మంచుతో పోటీపడుతున్న దుమ్ము. ఇదీ ఇప్పడు హైదరాబాద్‌ నగరంలోని పరిస్థితి. దీంతో నగరవాసులు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కళ్లకు, ముక్కుకు బట్ట కట్టుకోకుండా బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ పరిస్థితి మున్ముందు హైదరాబాద్‌ మహానగరానికీ రానుందన్న అభిప్రాయాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. శాటిలైట్‌ ద్వారా వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే ఢిల్లీలో ఉండే వాయు కాలుష్యం ఒక చోట నుంచి మరోచోటుకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

ఉత్తరభారత దేశంలో కేంద్రీకృతమైన పొగమంచు బలమైన గాలుల వల్ల దక్షిణ భారతదేశం వైపునకు వచ్చే అవకాశముందని, అది హైదరాబాద్‌ చుట్టూనే ఉండే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు తమ అధ్యయనంలో పేర్కొంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పట్టణీకరణతో నగరాల్లో వాయి కాలుష్య తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. శరవేగంగా విస్తరిస్తున్న మన నగరానికి వాయు కాలుష్య ముప్పును ముందస్తు హెచ్చరికగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నగరం నలుమూలలా భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

అదేవిధంగా జనాభా పెరిగినట్లుగా వాహనాల సంఖ్యా పెరుగుతోంది. పరిశ్రమలు సైతం వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. ఈ మూడు అంశాలే నగరాన్ని మరింత భయపెడుతున్నాయి. ఈ క్రమంలో నిపుణులు వాయు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు నిరంతర పర్యవేక్షణ, నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. వాయి కాలుష్య తీవ్రత జాతీయ ప్రమాణాల పరిమితిని ఎప్పుడో అధిగమించిందని పర్యావరణ సంస్థలు పేర్కొంటున్నారు.

నగరంలో పీఎం 2.5 సాంద్రత ఉండాల్సిన పరిమాణం నెలకు 60 మైక్రో గ్రాములు, ఏడాదికి 40 మైక్రో గ్రాములు. ఈ పరిమితి మన నగరంలోనూ పలు చోట్ల దాటిపోయాయి. జూపార్కు ప్రాంతంలో 2016లో 58.5 మెక్రో గ్రాములు ఫర్‌ క్యూబిక్‌ మీటర్లుగా నమోదైంది. అంటే నిర్ణీత పరిమాణం కంటే 18.5 మైక్రో గ్రాములు ఎక్కువగానే ఉంది. ఇలా కొన్ని చోట్ల వాయు కాలుష్య తీవ్రత కొన్ని చోట్ల పరిధులు దాటుతోందని పీసీసీ అధికారులు తెలిపారు. తాజా అధ్యయనం ప్రకారం గాలిలో కలిసిన సూక్ష్మ ధూళి కణాలు సుమారు 30వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేస్తాయి.

ఢిల్లీ చుట్టు ఉన్న రాష్ట్రాల్లోని పంటలను కాల్చడం ద్వారా వెలువడుతున్న కాలుష్యంలో ఎక్కువగా పీఎం 2.5, పీఎం 10లు ఉంటాయి. ఇవన్నీ గాలిలో చేరిన తర్వాత గాలి వాటం ఉన్న వైపు ప్రయాణం చేస్తాయి. ప్రస్తుతం ఉత్తరం నుంచి దక్షిణం వైపు గాలి వీస్తుండడం వల్ల మొదట హైదరాబాద్‌ నగరం వైపే వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు తమ అధ్యయనంలో పేర్కొంటున్నారు.

Read Also

సూపర్ ట్విస్ట్... మహా పీఠంపై సర్ ప్రైజ్ సీఎం
ఉండవల్లి శ్రీదేవి- ఎల్వీ సుబ్రహ్మణ్యం... ఈ కథేంటి? దానివెనుక సంగతేంటి?
తెలుగుభాష చచ్చిపోతోంది... కొంచెం గగ్గోలు పెట్టండయ్యా !