హైదరాబాదు మెట్రో ఆద్యుడు బాబే - మెట్రో ఎండీ

May 23, 2020

తనంతట తాను తన ఘనతను చెప్పుకోవడం వల్ల చంద్రబాబు చేసిన పనులు కూడా ఆయనకు మైలేజీని తీసుకురాలేకపోతున్నాయి. బాబును సరిగా ప్రొజెక్ట్ చేయడంలో ఆయన వర్గం పూర్తిగా విపలం అవుతుంది. హైదరాబాదుకు కొత్త విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలుకు పునాదులు వేసింది చంద్రబాబే. కానీ స్వయంగా చంద్రబాబు ఆ విషయాన్ని చెప్పడం వల్ల దానిని వైసీపీ అదేపనిగా ఎద్దేవా చేస్తోంది. అయితే, ఈరోజు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. 

మెట్రో అప్ డేట్స్, రికార్డ్స్ పై మీడియాతో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మెట్రోకు చంద్రబాబు నాయుడు ఆద్యుడు అన్న విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. వైఎస్ మెట్రో మంజూరు చేయించాడు అనడం కరెక్టు కాదన్న విషయం అధికారికంగా ఎన్వీఎస్ రెడ్డి మాటల్లో వెల్లడైంది. ఆయన ఏమన్నారంటే...

‘‘2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ మెట్రో రైల్ సంస్థకు హైదరాబాదు మెట్రోకు డీపీఆర్ తయారుచేయమని బాధ్యతలు అప్పగించారు. దాంతో మెట్రో ప్రతిపాదనకు పునాదులు పడ్డాయి. వాటిలో మియాపూర్ నుంచి చైతన్యపురి, సికింద్రాబాద్ నుంచి ఫలక్ నుమాకు రెండు లైన్ల మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారుచేయించారు. డీఎంఆర్సీ ఈ ప్రాజెక్టు కోసం 269 ఎకరాలు కావాలని డీపీఆర్ లో పేర్కొంది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక హైటెక్ సిటీ నాగోల్ కారిడార్ కూడా కలిపి మూడుకారిడార్లకు విస్తరించి మెట్రో మొదలుపెట్టారు. ప్రభుత్వమే ప్రాజెక్టు చేస్తే ఎన్ని ఎకరాలు డీఎంఆర్సీ సూచించిందో... మేము కూడా అన్నే ఎకరాలు తీసుకున్నాం. ఒక్క ఎకరా కూడా ఎక్కువ తీసుకోలేదు’’ అని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.  తెలుగుదేశం తన విజయాలను నమ్మశక్యంగా జనానికి చెప్పుకోవడంలో కూడా ఇంత ఘోరంగా విఫలం అవుతోందా?