హైదరాబాదుకు ఇదే అతిపెద్ద గుడ్ న్యూస్

April 06, 2020

మెట్రో పూర్తి కానంత వరకు అది ప్రారంభం కాక ముందు... ఇదొచ్చేదా, చచ్చేదా అన్నట్లుంది ప్రజల ఫీలింగ్. ఒకవేళ వచ్చినా... ఆ రేట్లు, మెట్లు ఎక్కడాలు, టెక్నాలజీ ఓయబ్బో అవన్నీ ఉపయోగపడినపుడు చూసుకుందాం లే అనుకున్నారు. కానీ ఢిల్లీ తర్వాత హైదరాబాదు మెట్రో సూపర్ హిట్ అయ్యింది. ప్రారంభం ఆలస్యం అయినా... అత్యంత ప్రయోజనకారిగా మారింది. ఇపుడు హైదరాబాదు ప్రజలకు అత్యంత ఇష్టమైన ప్రయాణ సాధనం మెట్రో రైలే. అద్దెబైకులు, బైకు ట్యాక్సీలు, షటిల్ సర్వీసులు ఈ మెట్రో ప్రారంభ సమయానికి సరిగ్గా అందుబాటులోకి రావడంతో మంచి సక్సెస్ అయ్యింది. అయితే... ఇపుడు మరో పెద్ద గుడ్ న్యూస్ ప్రజల చెవిన పడింది.

మెట్రో ఇక్కడ బాగా సక్సెస్ అయిన నేపథ్యంలో రెండోదశపై ఆసక్తి పెరిగింది. గవర్నమెంటుకు, ఎల్ అండ్ టీకి కూడా ఆసక్తి పెరిగింది. దీంతో రెండో దశపై మొత్తం డీపీఆర్ తయారుచేసి దానిని ప్రభుత్వానికి సమర్పించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మెట్రో రైలు టిక్కెట్ల ద్వారా నెలకు 30 కోట్ల ఆదాయం, ప్రకటనల ద్వారా నెలకు 10 కోట్ల ఆదాయం వస్తోందని, ఏడెనిమిదేళ్లలో ఖర్చు తిరిగి వచ్చేస్తుందని అంటున్నారు ఎండీ. ఆయన రెండో దశ మార్గాలను వెల్లడించారు. 

  • రాయదుర్గం - ఎయిర్ పోర్ట్ రూటు
  • లక్డీకాపూల్ - ఎయిర్ పోర్ట్ రూటు
  • నాగోల్ - ఎల్బీనగర్ రూటు 

ఈ మూడు మార్గాల్లో కిలోమీటరుకు 300 కోట్ల ఖర్చుతో ప్రతిపాదనలు ఇచ్చినట్లు మెట్రో ఎండీ పేర్కొన్నారు. ఇప్పటికి నాలుగు మాల్సే నిర్మించామని, ఇంకా నిర్మిస్తామన్నారు. వీటితో పాటు హైటెక్ సిటీలో ఒక ఐటీ టవర్ నిర్మిస్తున్నట్లు చెప్పారు.  మెట్రో ప్రయాణానికి మంత్లీ పాసులు ఉండవన్నారు. ప్రస్తుతం 55 రైళ్లు నడుపుతున్నట్లు చెప్పారు. పైన పేర్కొన్న రూట్లలో కనుక మెట్రో పూర్తయితే హైదరాబాదు మోస్ట్ హాసల్ ఫ్రీ కమ్యూటింగ్ సిటీ అవుతుంది. ట్రాఫిక్ చిక్కులు భారీగా తగ్గుతాయి.