మెట్రో రైలు తిరుగుతుందా?... ఎపుడు? సీటింగ్ ఎలా?

August 13, 2020

మెట్రో రైలు తిరుగుతుందా? 16 వేల కోట్ల ఖర్చుతో 5 ఏళ్లకు పైగా నిర్మాణంతో మొదలుపెట్టిన హైదరాబాదు మెట్రో రైలు ఊహించిన దానికంటే గొప్పగా విజయవంతం అయ్యింది. అయితే.. మొదటి ఏడాదే చుట్టుముట్టుని ఈ మహ-మ్మారి వల్ల హైదరాబాదు మెట్రో రైలు తీవ్రమైన క్రైసిస్ లో పడింది. లాక్-డౌన్ పూర్తయిన అనంతరం కూడా మెట్రో రైలు వ్యాపారం మునుపటిలా కళకళలాడదు.

కిక్కిరిసిపోయిన రైళ్లను ఇంకో ఏడాదిపాటు చూడలేం. జనం ఎక్కరు. గవర్నమెంటు ఒప్పుకోదు. సీటింగ్ పద్ధతి ఇపుడున్నట్లు సాధ్యమో కాదో కూడా తెలియడం లేదు. నిలబడి ప్రయాణించే అవకాశం ఉందో లేదో తెలియదు. తోసుకోకుండా దిగడానికి స్టేషనులో ఆగే సమయం పెరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి ఖర్చు తడిసిమోపెడవుతుంది.

దీంతో పాటు ఇక ప్రతిరోజు శుభ్రపరిచే ఖర్చు ఎంత ఉంటుందో తెలియదు. అన్ని స్టేషన్లు ఆగే పరిస్థితి కూడా ఉండదని చెబుతున్నారు. ఇవన్నీ ఏర్పాట్లు చేసి ప్రారంభించడానికి జూన్ అవుతుందో, జులై అవుతుందో తెలియని పరిస్థితి. దీంతో ప్రారంభించిన తొలి రోజుల్లోనే మెట్రో కి పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఇక వీరి మాల్స్ పరిస్థితి మరీ ఘోరం. 

ఏడాది పాటు మాల్స్ వ్యాపారం దారుణంగా పడిపోనుంది. ట్రయల్స్ వేయడానికి కంపెనీలు ఒప్పుకోకపోవచ్చు. మరి ట్రయల్ వేయకుండా  మాల్ కి వెళ్లడం ఎందుకు? అని జనం అనుకోవచ్చు. పైగా అంత జనంలో పోవాల్సిన అవసరం ఏముందనుకోవచ్చు. పైగా మాల్స్ పైన మల్టీప్లెక్సుల భవిష్యత్తు అయితే గందరగోళంగా ఉంది. వీరందరి ఆశ వ్యాక్సిన్ పైనే. అది ఎపుడొస్తుందో ఏమో.