సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్యపిల్లల్నేం చేశాడంటే..

August 07, 2020

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. వనస్థలిపురం పరిధిలోని హస్తినాపురంలో దారుణ విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక ఐటీ ఉద్యోగి ఊహించని రీతిలో చేసిన పని షాకింగ్ గా మారింది. ఐబీఎంలో ఐటీ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు 33 ఏళ్ల ప్రదీప్. హస్తినాపురంలోని సంతోషిమాత కాలనీలో నివాసం ఉండే వారు రెండేళ్ల క్రితం అక్కడే ఒక ఇంటిని నిర్మించుకున్నారు.
శనివారం రాత్రి భార్య స్వాతి.. ఇద్దరు పిల్లలు కల్యాణ్(6).. జయకృష్ణ(2) ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. ఇదేమీ తెలీని వారు అది తిని ప్రాణాలు విడిచారు. అనంతరం వారి శవాల వద్దే రోజంతా గడిపిన ప్రదీప్.. ఆదివారం తాను కూడా విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
మరణించిన స్వాతిది మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి. స్వాతి ఎమ్మెస్సీ లో గోల్డ్ మెడలిస్ట్ గా చెబుతున్నారు. శనివారం నుంచి ఈ కుటుంబంలోని వారు ఇంట్లో నుంచి బయటకు రాలేదని చెబుతున్నారు. ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవటంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చారు. తలుపు కొట్టినా ఎంతకూ తలుపు తీయకపోవటంతో తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. లోపలకువెళ్లిన వారంతా షాక్ తింటున్నారు. వారంతా నలుగురు విగతజీవులుగా కనిపించారు. వీరి మరణం షాకింగ్ గా మారటంతో పాటు.. విషాదంలో ముంచెత్తుతోంది.