మహేష్ కి తల్లిగా నటిస్తా... పవన్ హీరోయిన్ !!

August 07, 2020

రేణు దేశాయ్... పవన్ మాజీ భార్య. ఆమె ప్రతి మాట సంచలనమే. పవన్ వ్యక్తిగత జీవితాన్ని వైసీపీ తెరమీదకు తేవడం, పవన్ అభిమానులు ఆమెను విమర్శించడం వంటి కారణాల వల్ల కొంతకాలం ఆమెను అల్లుకుని పవన్ చుట్టూ వివాదాలు నడిచాయి. ఆ తర్వాత అవి మెల్లగా సద్దుమణిగాయి. పవన్ తో విడిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న రేణు ఇపుడు హ్యాపీగా తన పనులు తాను చేసుకుంటోంది. సినిమా వ్యాపారంలో, ఎంటర్ టైన్ మెంట్ వ్యాపారంలో అడుగుపెట్టి బానే సక్సెస్ అవుతోంది. 

ఆమె తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చినపుడల్లా ఏదో ఒక సంచలన విసయం వెల్లడిస్తూ ఉంటుంది. ఇటీవలే  ఒక ఇంటర్వ్యూలో బద్రి సినిమా నాటి ఫొటోలను, అనుభవాలను పంచుకున్నారు ఆవిడ. తాజాగా అందరికీ షాక్ ఇస్తూ... పవన్ కు పోటీ అనుకుంటున్న మహేష్, ప్రభాస్ అభిమానులకు షాకిచ్చింది. అవకాశం వస్తే... మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ తల్లి పాత్రల్లో నటిస్తానని చెప్పింది. ఇది పవన్ అభిమానులకే కాదు, తెలుగు సినిమా అభిమానులు అందరికీ షాకే. ఆమె తనను తాను ముసలిదాన్ని అయిపోయాను అంటూ కామెంట్లు చేసుకుంటుంది కానీ... ఇప్పటికీ ఆమెను హీరోయిన్ అందాలతో పోల్చేవారు బానే ఉన్నారు.

లుక్స్ పరంగా వారికి తల్లిగా ఆమె సరిపోవచ్చేమో గా వయసు పరంగా చూస్తే... అందరూ సర్ ప్రైజ్ అవుతారు. రేణు వయసు 38 సంవత్సరాలు. అల్లు అర్జున్ వయసు 37 సంవత్సరాలు. అంటే రేణు కంటే ఒక్క ఏడాదే తక్కువ. అయితే ఎలాగూ పపన్ మాజీ భార్య. కాబట్టి ఆల్రెడీ ఆమె అల్లుకి అత్తే. తల్లిగా చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. ఇక ప్రభాస్ రేణు కంటే రెండేళ్లు పెద్ద. మహేష్ బాబు రేణు కంటే ఆరేళ్లు పెద్ద. కానీ తనకంటే పెద్ద వాళ్లకి తల్లిగా చేస్తానంటూ ఆసక్తికరమైన కామెంట్ చేసింది. అయితే ఇక్కడ ఓ ట్విస్టు ఇచ్చింది. ఆ సినిమాలో చిన్నప్పటి క్యారెక్టర్లకు అమ్మగా చేస్తాను అంటూ మెలిక పట్టింది. అయితే... తర్వాత సర్దుకుని నన్ను నా ఫ్రెండ్స్ కూడా అమ్మగానే చూస్తారు. అందరికీ అమ్మగారిని అయిపోయాను. కచ్చితంగా చేస్తాను అమ్మగా అంటోంది. అది ఈజీ తనకు అంటోంది.

 ఈ వ్యాఖ్యలను బట్టి... ఆమె ఎంత ఇండిపెండెంటో అర్థమవుతుంది. రేణు తనకు నచ్చింది చేస్తుంది గాని ఎవరి ఒత్తిళ్ల ప్రకారమో చేయదు అని చెప్పడానికి ఆమె తాజా కామెంట్స్ పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. తనకు అనిపించింది చెప్పడానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి ఆమె.