మెగా ఫ్యామిలీలో మరో ప్రేమ వివాదం

June 01, 2020

చిరంజీవి కుటుంబం తరచూ ప్రేమ వివాదాలతో రచ్చకెక్కడం అభిమానులను బాధిస్తోంది. చిరంజీవి ఇద్దరు కూతుళ్లు ప్రేమలో పడటం, తర్వాత వారు ఆ సుడిగుండంలోంచి బయటకు రావడంతో కథ సుఖాంతం అయ్యింది అనుకుంటుంటే... తాజాగా ఆ కుటుంబంలో ఇంకో కలవరం మొదలైంది. చిరంజీవి కూతుళ్లు అయిపోయారు. ఇపుడు నాగబాబు కూతురు వంతు వచ్చింది. అయితే... పరిస్థితి గతంలో లా లేదు. కాకపోతే వివాదం అయితే ప్రేమకు సంబంధించినదే.
మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక సినీ రంగంలో అడుగుపెట్టింది. ఈవెంట్లు చేస్తోంది, హీరోయిన్ గా నటించింది. వెబ్ సిరీస్ లు చేస్తోంది. అయితే, ఆమె హీరోయిన్ గా నటించిన తొలి సినిమాలో కథానాయకుడు నాగశౌర్యతో ఆమె ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. అపుడు పెద్ద ఎత్తున మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే నాగశౌర్య అదంతా అబద్ధం అని తేల్చడంతో అప్పటికి ముగిసింది. తాజాగా మరోసారి ఆ వార్తలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. దీంతో నాగశౌర్య ఆందోళనకు గురయ్యారు. చివరకు మరోసారి చాలా స్పష్టంగా అతను క్లారిటీ ఇచ్చాడు.
’’నేను నిహారికను ప్రేమించడం లేదు. నన్ను నిహారిక ప్రేమించడం లేదు. అసలు ప్రస్తుతం నేను ఏ అమ్మాయితోనూ ప్రేమలో లేను. ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ అబద్ధం. నా స్నేహితులు కూడా నేను ప్రేమలో ఉన్నాను అనుకుంటున్నారు. మళ్లీ మళ్లీ చెబుతాను. నేను ఎవరితోనూ ప్రేమలో లేను. ఎవరితోనూ నాకు అఫైర్ లేదు’’ అంట నాగశౌర్య స్పష్టంచేశారు. మరెందుకు ఈ వార్తలు వైరల్ అయ్యాయంటే... ఇటీవల పాపని ఎత్తుకుని దిగిన ఓ ఫొటోను నిహారిక పోస్టు చేస్తే... దానికి ఓ కామెంట్ రాసినందుకు ఈ గొడవంతా మొదలైందట. ఈ నెటిజన్లున్నారే.... అన్నిటినీ కెలికేస్తారు సుమా?!!!