తాను తాగుబోతు అని చెప్పేసిన హీరోయిన్

August 05, 2020

వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయ్యేందుకు సినీ తారలు.. సెలబ్రిటీలు పెద్దగా ఇష్టపడరు. అందునా మందు కొట్టటం.. ఆ తర్వాతేం చేసేది లాంటి వాటిని బయటపెట్టేందుకు ససేమిరా అంటారు. అలాంటిది అందుకు భిన్నంగా తాగేది చెప్పేస్తే ఏమవుతుందని అనుకున్నారో కానీ.. ఆ విషయాల్ని పూస గుచ్చినట్లుగా చెప్పేయటం షురూ చేశారు. ఇంతకీ అంత ధైర్యం ఎవరికుందంటారా? అక్కడికే వస్తున్నాం.
తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయిపోయారు మలయాళీ ముద్దుగుమ్మ వీణా నందకుమార్. తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆమె.. తన తాగుడు అలవాట్ల గురించి చెప్పేశారు. తాను బీర్లు ఎక్కువగా తాగుతానని.. అదేమీ నేరం కాదన్న ఆమె.. బాగా తాగిన తర్వాత తానెవరినీ ఇబ్బంది పెట్టనని చెప్పారు. తాను మద్యం సేవించటం వల్ల ఎవరికీ నష్టం లేదన్న ఆమె.. తనను విమర్శించే హక్కు ఎవరికీ లేదని తేల్చేశారు.
తన వ్యక్తిగత అవసరం కోసం తాగుతున్నట్లు చెప్పిన ఆమె.. అందరూ తాగుతున్నారు కదా? నేనూ అంతేనని చెప్పారు. తన అలవాట్ల గురించి బయటకు చెప్పేందుకు తాను అస్సలు భయపడనని చెప్పింది. ఇవాల్టి రోజున చుక్కేయటం పెద్ద విషయం కాదు. కానీ.. ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేయటం.. గొంతులోకి చుక్క పడిన తర్వాతేం జరుగుతుందన్న విషయాల్ని చెప్పేయటం మాత్రం గొప్పే.