ప్రియాంక: ఆ నలుగురిని చంపి జైలుకెళతానంటోంది

May 31, 2020

ప్రియాంక కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం అయ్యిందో తెలిసిందే. నిందితులను తిట్టని వారు లేరు. ఈ కేసులో వెంటనే నిందితులకు శిక్ష పడాలని, మీన మేషాలు లెక్కెట్టొద్దని అందరూ డిమాండ్ చేస్తున్నారు. సెలబ్రిటీలంతా ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తంపరుస్తూ కన్నీరు కార్చారు. తెలుగు నటి పూనమ్ కౌర్ ఒకడుగు ముందుకు వేసి పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది.

ప్రియాంకరెడ్డిని చంపేసిన నీచులను మీరు వెంటనే పెద్ద శిక్ష వేస్తారా? లేదా ? చెప్పండి. మీరు వెంటే ఏ చర్య తీసుకోకపోతే ఆ నలుగురిని తానే చంపి జైలుకెళ్తానని హెచ్చరించారు పూనమ్ కౌర్. ఆడవాళ్లపై ఘోరాలు జరిగినపుడల్లా నాలుగైదు రోజులు హడావుడి చేస్తారు. ఆ తర్వాత  అంతా మరిచిపోతారు. ఈ సారి దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆ దుర్మార్గులు చావాల్సిందే అంటూ పూనమ్ వీడియో ద్వారా హెచ్చరించారు. పూనమ్ స్పందన అందరినీ ఆకట్టుకుంది. పోలీసుల్లో ఈ ఫైర్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. శభాష్ పూనమ్ అంటూ పూనమ్ రెస్పాన్స్ ను అభినందిస్తున్నారు. పూనమ్ స్పందన ఆమె మాటల్లోనే. 

 

Read Also

పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో ప‌వ‌న్‌...!
ఎంత ఏడ్చానో.. ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో
మీకిష్టం లేకపోతే నా పదవికి రాజీనామా చేస్తా...