I Love Society-I Love People-రవి కొండపల్లి , బిసి నాయకులు

August 08, 2020

తెలుగుదేశం, వైసిపి ,జనసేన ,సిపిఐ ,సిపిఎం ,బిజెపి ,కాంగ్రెస్ పార్టీలు ఏవైనా అన్ని కులాల సమ్మళేనం వుంటుంది ..

ఎ ఒక్క కులం మద్దతుతోనో లేక అభిమానంతో అధికారాన్ని పొందలేవు ...

ఇక రాజకీయంలో దోచుకోవడం ,దాచుకోవడం అనేది వుండదా అంటే ఖచ్చితంగా వుండదు అని చెప్పలేం దానికి ఏ కులం కూడా అతీతం కాదు ...

వారికున్న అవకాశాన్ని బట్టి వుంటుంది ...

కానీ నిజం ఏంటంటే పార్టీలలో కొన్ని కులాల డామినేషన్ మాత్రం వుంటుంది దానికి ఖచ్చితంగా ఇది కారణం అని చెప్పలేం అది ఈరోజే మొదలయ్యింది కాదు

రాజకీయాలలో డామినేషన్ కి ప్రదాన కారణం డబ్బు తరువాతే మిగిలిన అంశాలు

ఈ డబ్బు అనేది అగ్రవర్ణాలుగా పిలువబడే వారి దగ్గర ఉంది కనుక వారు అన్ని రంగాలలో మొదటిస్తానంలో వున్నారు

సరే వాళ్ళకి ఏలా వచ్చాయి అంటే దానికి సమాధానం నా దగ్గర లేదు కానీ ఒకటి చెప్పగలను వచ్చినదానిని నిలబెట్టుకుని ఇంకా పైకి ఎదగడం అనేది కూడా గొప్పతనమే (కంటికి గొప్పగా కనిపించే ప్రతిధాని వెనుక కనపడని కష్టం వుంటుంది)

ఇక అసలు విషయానికి వస్తే గత కొద్ది రోజులుగా ఒక కులం మీద జరిగే దుష్ప్రచారం ,దానిని కొంతమంది నిజాలు తెలిసినా అభిమానం అనే ముసుగులో చిమ్మే విషం చూస్తే మాటలు పడే సామాజిక వర్గం మీద జాలి కంటే నాకు కోపమే ఎక్కువ వస్తుంది ..

అందరూ అంటున్నట్లు ఈ విషయంలో వైసిపిలోని వారు మాట్లాడటం లేదు అంటారు నేనయితే వాళ్ళని తప్పు పట్టను .రాజకీయం అంటే వంద అవసరాలు వుంటాయి.రాజకీయ పార్టీలలో వుండి ప్రజల తరుపున ప్రాతినిధ్యం వహించేవారు కావాలని కులాన్ని నెత్తిన పెట్టుకుని కోరి కష్టాలు తెచ్చుకోరు.ఇందులో ఏ పార్టీలో వున్న కులనాయకులని నిందించకూడదు ...

కానీ రాజకీయ పార్టీలను పక్కన పెడితే కనీసం తక్కువలో తక్కువ 30% అయినా పార్టీలతో సంభంధం లేకుండా వున్నారు ,ఒక 10% అర్గనైజేషన్స్ వున్నాయి ..

ఇంతగా దుష్ప్రచారం జరుగుతుంటే ఏందుకు మౌనంగా వుంటున్నారు .

ఈరోజు లాగు కట్టుకోవడం రాని పిల్లాడిని మందలించి చూడండి బయట రియాక్షన్ ఏలా వుంటుందో !

అలాంటిది అంతటా మేమే ,అన్నింటా మేమే అనేవాళ్ళు ఏందుకు మాట్లాడరు

స్వప్రయోజనాల కోసమా అంటే ఆత్మాభిమానాన్ని చంపుకుని ఇంకా సంపాదించేది ఏముంది ?ఇప్పటికీ మెజారిటీ మంచి పోజిషన్ లోనే వున్నారు తినటానికి వుండటానికి డోకా లేకుండా !

ఏందుకో మౌనం అర్థం కాదు !

ఏవరో ఒకరు పాపం అవేశంతో స్పందించిన ఎదో ఒక ముద్ర పడటంతో ఫలితం శూన్యం !

కనీసం పార్టీలకతీతంగా ఒకసారైనా ప్రెస్ మీట్ పెడితే చూడాలని కోరిక నాకు ! నెరవేరుతుందో లేదో ?

ఒక్కోసారి అ విషపు ప్రచారం చూసి పిచ్చిపిచ్చిగా తిట్టాలని అనిపిస్తుంది కానీ నీకెందుకు అంటారు అని అలోచిస్తుంటా ?

రాళ్ళు పడినప్పుడే తిరిగి మనము విసరాలి కాదు ఆ రాళ్ళతో పునాదులు కడతాం ,భవనాలు కడతాం అనే డైలాగ్స్ నవ్వుకోవడానికే పనికివస్తాయి ...

రియల్ లైఫ్ లో పనిచేయవు

ఇంత రాసా కాబట్టి నేను ఏవరో అని వెతుక్కోకండి .
నేను ఎవరో చాలామందికి తెలుసు !

నా మిత్రులలో ,నేను ప్రయాణం చేసేవారిలో 80% ఈ సామాజిక వర్గం వాళ్ళే ! నాకెప్పుడూ ఏలాంటి తేడా కనపడలేదు ! కులాల అంతరం లేదు !

కమ్మ అంటే అమ్మ అనే బారి డైలాగ్స్ చెప్పను కానీ పదిమందికి దారి చూపుతారు,అవసరంలో అండగా నిలబడతారు ఇంత చేసి వాళ్ళు కోరుకునేది కేవలం గుర్తింపు అంతే !

దానిని కూడా దక్కనీయకుండా విషం చిమ్ముతాం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లే !

I Love Society
I Love People

సెలవు ...

మీ ,
రవి కొండపల్లి ,
బిసి నాయకులు(ఇది రాయకపోదును కానీ కులపిచ్చి కామెర్లు పట్టిన సమాజం నేను కమ్మ అనుకుంటారు అని రాస్తున్న)

 

RELATED ARTICLES

  • No related artciles found