ఏడ్చినంత పనిచేసిన తెలుగు హీరోయిన్ !!

August 07, 2020

హీరోయన్ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 2020 సంవత్సరం అత్యంత విషాదకరంగా గడుస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిరోజు భయాందోళనతో బతకాల్సి వస్తోందన్నారు. బతికి ఉన్నందుకు భగవంతుడికి కృతజ్జతలు తెలుపుతున్నట్లు పేర్కొంది. 

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనాతో ప్రపంచం మొత్తం కష్టాల్లోకి, నష్టాల్లోకి జారిపోయిందన్నారు. ఇలాంటి విపత్తు మునుపెన్నడూ చూడలేదని, మనం భవిష్యత్తులో కూడా చూడబోం అన్నారు. 

ఎవరిక వారు స్వీయరక్షణతో జాగ్రత్తగా ఉండటం తప్ప చేయగలిగింది ఏమీ లేదని, అన్నారు. ఇంకా అపుడే అయిపోలేదని... రాబోయేవి ఇంకా గడ్డు రోజులు అని, ఇంకా అనేక విపత్తులు, రోగాలు, యుద్ధాలు చుట్టుముడతాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. 

జీవితానికి సంబంధించి కరోనా ఎన్నో పాఠాలు నేర్పిందని మరింత జాగ్రత్తగా ఉండాలని అందరికీ సూచించింది. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్న రకుల్ లాక్ డౌన్ టైంలో ముంబైలో ఉంది. అనంతరం తల్లిదండ్రులను కలవడానికి ఢిల్లీ వెళ్లి ప్రస్తుతం హైదరాబాదులోని తన ఇంట్లో ఉంటోంది.