లగడపాటి షాకింగ్ ప్రెస్ నోట్

July 04, 2020

ఓడిపోయిన చంద్రబాబు కంటే... లగడపాటి మీద జనాలకు ఎక్కువ జాలి కలుగుతోంది. పాపం ఒకప్పుడు ఎలా ఉండేవాడు... ఇపుడు ఎలా అయ్యాడు అంటూ అతని మీద ట్రోల్స్ తో పాటు సానుభూతి కూడా వ్యక్తమవుతోంది. నిన్నటి నుంచి లగడపాటి ఎక్కడ అంటూ అందరూ అడుగుతున్నారు. అయితే, వారందరి కోరిక మేరకు లగడపాటి కనిపించారు. అయితే, పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.

మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ ‘తాను సర్వేలు చేయడం మానేస్తున్నట్టు’ రాత పూర్వకంగా ప్రకటన వెలువరించారు. ప్రజల నాడీని పట్టడంలో విఫలమైనందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. పక్షపాతం లేకుండా సర్వేలు చేశానని, తన సర్వేలతో ఎవరైనా నొచ్చుకుంటే క్షమించాలని లగడపాటి కోరారు. ఆయన ప్రెస్ మీట్ ఒక్కముక్కలో చెప్పాలంటే... ‘డిసెంబర్‌ 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలు, ఏప్రిల్ 2019లో జరిగిన ఆంధ్రప్రదేవ్ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నా. కారణాలేమైనప్పటికీ ప్రజానాడి పసిగట్టడంలో వరసగా రెండుసార్లు విఫలమైనందుకు గాను భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉండదలుచుకున్నా’ అని లగడపాటి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయిన వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

ఇదీ ఆయన ప్రెస్ నోట్ :