డాక్టర్లపై హెలికాప్టర్లతో పూల వర్షం

August 11, 2020

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వైద్యులు కరోనా రోగులకు సేవ చేసే క్రమంలో వ్యాధి సోకి మరణించారని తెలుసు. అయినా... ఇతరుల ప్రాణాల కోసం ఎంతో మనోధైర్యం వైద్యం అందిస్తున్న డాక్టర్లకు మనం ఏం చేసినా రుణం తీర్చుకోలేం. కోవిడ్ 19 వార్డులో డ్యూటీ చేయడం అంటే కేవలం వైద్యం చేయడం మాత్రమే కాదు, ధైర్యముంటే మాత్రమే చాలదు... కుటుంబానికి కూడా దూరంగా ఉండాలి. సొంత వారిని కలిసే అవకాశం కూడా లేని దుర్భర స్థితి. అయినా వారు మన కోసం ఎంతో పెద్ద మనసుతో త్యాగం చేస్తున్నపుడు మనం వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది.

అందుకే దేశ వ్యాప్తంగా వైద్యులకు గగన సత్కారం చేస్తోంది ప్రభుత్వం. భారత ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి సంయుక్తంగా దేశ వ్యాప్తంగా... పలు ఆస్పత్రుల్లో వైద్యులపై పూల వర్షం కురిపించి హార్థిక వందనాలు తెలిపింది. హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రిపై పూల వర్షం కురిసింది. విశాఖలోని చెస్ట్ ఆస్పత్రిపై, గీతం ఆస్పత్రిపై పూల వర్షం కురిసింది. ఇది రుణం తీర్చుకోవడం కాదు... వారిలోని దైవత్వానికి మనం చేసే నమస్కారం మాత్రమే. జై హింద్.