వాళ్ల పాస్ పోర్టు రద్దు చేస్తాం... కేసీఆర్ వార్నింగ్

April 05, 2020

మనం ఈరోజు అన్ని పనులు మానేసి ఇంట్లో కూర్చోవడానికి కారణం ఎవరు?

మన మార్కెట్లు దారుణంగా పతనమవడానికి దారితీసిన కరోనాను ఇండియాకు తెచ్చింది ఎవరు?

విదేశానికి వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులు, ఎన్నారైలు. 

వీరికి కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీ శ్రేయస్సు, మీ కుటుంబ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత కష్టపడుతుంటే... మీరు ఇంత బుద్ధిలేకుండా ప్రవర్తిస్తే ఊరుకోం. 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే. లేదు కాదు అని బయటకు వస్తే పాస్ పోర్ట్ సీజ్ చేస్తాం. ఇంకా అవసరమైతే సస్పెండ్ చేస్తాం. మీ వల్ల సమాజానికి చేటు జరుగుతుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమాజం ఇచ్చే అవకాశాలు వాడుకుంటూ వారికి ద్రోహం చేస్తే మీపై కఠిన చర్యలు తప్పవన్నారు. కర్ఫ్యూ పెడితేనే మాట వింటాం అంటే ఇంకేం చేస్తాం కచ్చితంగా పెడతాం. జాగ్రత్తగా ఉండండి. ఎవరి కోసం ఉండాలి ఇంట్లో మనకోసమే అని హెచ్చరించారు. రష్యాలో బయటకు వస్తే ఐదేళ్ల జైలు. అలా ఇక్కడ కూడా పెట్టమంటే పెడతాం అని హెచ్చరించారు. 

కూరగాయలు అధిక ధరలకు అమ్మొద్దు. మన దగ్గర సర్ ప్లస్ ఉత్పత్తి ఉంది. ఎక్కువ ధరలకు అమ్మితే పీడీ యాక్టుపెట్టి జైల్లో వేస్తాం. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకోవచ్చని కేసీఆర్ సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కూడా కొనసాగించాలని సూచించారు. మీకు అత్యవసరం పడితే 100 కు కాల్ చేయండి. మీకు పోలీసులు ఏ సహాయం అయినా చేస్తారు అని కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర సరిహద్దులో ఆగి ఉన్న వాహనాలను కూడా ఈ రాత్రికి అనుమతిస్తామని కేసీఆర్ ప్రకటించారు.  

 

Read Also

కేసీఆర్ సంచలన నిర్ణయం.. కాల్చేద్దామా?
తెలంగాణలో మరో 3 కేసులు.. లక్ ఏంటంటే..
వాహనం ఆపినందుకు కలెక్టరుతో గొడవపడ్డాడు