జగన్ వ్యూహాల్లో వీళ్లే బలిపశువులు !!

August 14, 2020

వాడుకుని వదిలేయడంలో వైసీపీ అధినేత జగన్ అందరినీ మించిపోతున్నారు. తనకోసం పనిచేసే వారిని, తనంటే పనిచేసేవారిని కరివేపాకులా తీసిపారేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు. తాజా ఉదాహరణ రమణ దీక్షితులు. జగన్ వాడకానికి బలైపోయిన జాబితా పెద్దదే. కానీ తెలివిగా... తాను చేసిన తప్పులను కూడా సమర్థించుకుని గొప్పగా చిత్రీకరించగల సైన్యం ఆయన వద్ద ఉంది. దీంతో తాత్కాలికంగా అధికార అండతో ముందుకు పోగలుగుతున్నారు. ఆయన వాడుకుని వదిలేసిన జాబితా పెద్ద ఎత్తున ఉంది. 

వాటిలో కొన్నిటిని చర్చించుకుందాం...

ఎల్వీ సుబ్రమణ్యం విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. తన కింది అధికారితో ఆయనను అవమానించారు. కానీ ఆయన జగన్ కోసం ఎన్నికల ముందు చంద్రబాబును వీలైనంత టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆయనకు జగన్ ఇచ్చిన బహుమానం అందరికీ తెలిసిందే.

ఐవైఆర్ కృష్ణారావు ఓ రేంజ్ లో చంద్ర బాబుపై దుష్ప్రచారం చేశారు. కానీ ఏమైందో ఏమో గాని ఆయన జగన్ పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన ట్వీట్లలోనే తెలుస్తోంది. 

వైఎస్ హయాం నుంచి మాదిరెడ్డి ప్రతాప్ వైఎస్ కుటుంబం కనుసన్నల్లో పనిచేశారు. అయినా చివరకు ఆయనకు క్రమశిక్షణ నోటీసులు ఇచ్చారు. బదిలీని అంగీకరించినా కూడా నోటీసులు ఇవ్వడం గమనార్హం.

దళిత ఉన్నత అధికారి అయినా పీవీ రమేష్ మంచి పనిమంతులు. జగన్ కోసం చాలా కష్టపడ్డారు. కొంతకాలం బాగా చూసుకున్నట్టే అనిపించిన జగన్ ఆయన అధికారాలు పీకి పక్కనపెట్టేశారు. 

గోదావరి జిల్లాల్లో మహా సేన రాజేష్ జగన్ అంటే పడిచచ్చేవారు. టీడీపీ క్యాడర్ ను భయపెట్టినంత దళితకార్డు వాడి జగన్ కు తెగ ప్రచారం చేశారు. చివరకు అధికారంలోకి వచ్చాక అతన్ని పక్కనపెట్టారు. అతని కి జ్జానోదయం అయ్యి జగన్ అరాచకాలను తన నోటితేనే పలుమార్లు వివరించారు.

ముద్రగడ అయితే జగన్ జేబులో మనిషిగా పనిచేశారు. కానీ ఏకంగా ఆయన ఉద్యమమే మానేసే పరిస్థితులను సృష్టించారు. చివరకు ఏమీ చేయలేక ఆయన ఉద్యమాన్ని మానేశారు.

రోజా అయితే... అసంతృప్తి ఉన్నట్లు కనిపించదు గానీ... జగన్ తోనే ఉంటూ పార్టీకి మంచి వాయిస్ గా ఉంటూ ఎంత కృషిచేసినా జగన్ రోజా మంత్రి పదవి కల నెరవేర్చలేదు. నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టారు.

మంత్రి పదవి కావాలా? రాజ్యసభ పదవి కావాలా అంటే ఎవరైనా మంత్రిపదవే కావాలంటారు. మంత్రులుగా ఉన్న ఇద్దరు బీసీలకు ఆ పదవులు పీకేసి రాజ్యసభకు పంపించారు. ఇపుడు వాటిని తన వ్యాపార అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇక తాజా బలిపశువు రమణ దీక్షితులు. చంద్రబాబును తిడితే చాలు జగన్ తనను అందలం ఎక్కిస్తాడు అనుకున్నాడు. లేని పింక్ డైమండ్ గురించి గగ్గోలు పెట్టి బాబును బదనాం చేశారు. చివరకు తాజాగా బాబు మనుషులదో టీటీడీలో రాజ్యం. జగన్ గారూ వాళ్లను పీకేయండి అంటూ ఈవో సింఘాల్ తదితరులపై కంప్లైంట్ చేస్తే జగన్ వారికి పదవులిచ్చి రమణ దీక్షితుల నోటికి కళ్లెం వేశారు. 

వీరితో పాటు బాబుపై యుద్ధం చేసినా జగన్ దయకు నోచుకోని ఇంకొందరు... చలసాని, పోసాని, మోహన్ బాబు, నటుడు అలీ, ఇంకా ఈ జాబితాలో ఎంత మంది ఉన్నారో, ఎంత మంది చేరతారో సమీప భవిష్యత్తులో !