జమ్మూకాశ్మీర్ - ఇంపార్టెంట్ అప్ డేట్స్

July 06, 2020

జమ్ముకాశ్మీర్ పై మోడీ కన్ను పడిన వాతావరణ స్పష్టంగా కనిపిస్తోంది. అమిత్ షా ఆధునిక భారతీయులకు కాశ్మీర్ ను గిఫ్ట్ గా ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. ఏవేవో అంశాలు తెరమీదకు వస్తున్నాయి. ప్రభుత్వం ఉగ్రదాడిని అడ్డుకోవడానికి అని మాత్రమే చెబుతున్నా... ప్రికాషన్స్ చూస్తుంటే... చాలా పెద్ద ఎత్తున ఏదో జరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన పాయింట్లు.

1. జమ్ము కశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన జమ్ము కశ్మీర్‌ రిజర్వేషన్‌ (రెండో సవరణ) బిల్లు-2019ను హోం మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. నిర్ణయించిన దానికంటే రెండు రోజులు ముందుగానే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ గత బుధవారమే ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
2. హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అర్వింద్‌ కుమార్‌, రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్) అధిపతి సమంత్‌ గోయల్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ గౌబా తదితరులు పాల్గొన్నారు.
3. కశ్మీర్ నుంచి అమర్‌నాథ్ యాత్రికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ తమ ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో జమ్మూలో రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
4. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను రద్దు చేస్తే అది జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రజలపై రాజ్యాంగ వ్యతిరేకంగా వెళ్లినట్లేనని ప్రకటించారు. ఉద్రిక్తతలను పెంచే దిశగా చర్యలు తీసుకోవద్దని భారత దేశానికి, పాకిస్థాన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, పీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.
5. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో శ్రీనగర్‌ నిట్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థులు ఇంటి బాట పట్టారు. విద్యార్థులను, అమర్ నాథ్ యాత్రికులను వెనక్కి వెళ్లమని గవర్నమెంటు ఆదేశాలు జారీచేసింది.
6. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఆ దేశ ‘జాతీయ భద్రతా కమిటీ’(ఎన్‌ఎస్‌సీ)తో అత్యున్నత సమావేశం నిర్వహిస్తున్నారు. కాశ్మీర్‌ పరిణామాలపై ఇమ్రాన్ ఖాన్ ఆరా తీశారు.
7. బ్రిటన్, జర్మనీ ప్రభుత్వాలు కాశ్మీర్‌కి వెళ్లొద్దని తమ పౌరులకు చెప్పాయి.
8. ఆల్రెడీ జమ్మూకాశ్మీర్‌లో 3 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఇటీవలే అదనంగా 10వేల కేంద్ర బలగాలు వెళ్లాయి. తాజాగా 25 వేల బలగాలు తరలిస్తున్నారు.
9. భారీ ఎత్తున బలగాల తరలింపు అందర్నీ ఆశ్చర్యంలో, ఆందోళనలో పడేస్తోంది. సడెన్‌ ప్రకటనలకు పేరొందిన మోడీ నోట్ల రద్దు లాగే... కాశ్మీర్‌పైనా సంచలన ప్రకటన చెయ్యబోతోందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
10. అసలు ఇంత చిక్కు ఎందుకంటే... భారతదేశంలోని ఇతర ఏ రాష్ట్రంలో అయినా ఆస్తి కొనే హక్కు ఉంటుంది. కొన్నాళ్లు అక్కడే చదువుకుంటే స్థానికులు అవుతారు. కానీ కశ్మీరులో ఎవరికీ ఆస్తి కొనే హక్కులు లేవు. అక్కడ స్థిరపడినా... రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకవు. కేవలం పరాయి వాడిగానే టూరిస్టుగానే బతకాల్సిందే. ఈ హక్కులు కశ్మీరులకు మాత్రమే కల్పిస్తున్న నిబంధనలు ఆర్టికల్ 370, 35ఎలు. అందుకే వీటి భరతం పట్టాలని మోడీ నిర్ణయించారు.