ఇటలీని దాటేశాం... అయితే ఏంటి?

August 03, 2020

సరిగ్గా నెల క్రితం ఇటలీని చూసి, అమెరికాన చూసి ఆశ్చర్యపోయాం. బళ్లు ఓడలయ్యాయి, ఓడలు బళ్లయ్యాయి... ప్రపంచం ఇపుడు ఇండియాను చూసి ఆశ్చర్యపోతుంది. మన చావులు, మన కేసులు ప్రపంచం లెక్కిస్తోంది. అసలు వచ్చే నెలలో ఇండియా పరిస్థితి ఏంటి? అని అనుమానపడుతోంది. 

తాజాగా ఈరోజు 2.37 లక్షల కేసులు నమోదయ్యాయి. నిన్నటి వరకు ఇటలీ వెనుక ఉన్న మనం ఈరోజు  ఉదయానికి 9851 కేసులు నమోదు కావడంతో  ఇటలీని వెనక్కు తోసి 6వ స్థానానికి ఎగబాకాం. మొదట్లో మరణాలు మన వద్ద చాలా తక్కువగా ఉండేవి. ఇపుడు మరణాలు కూడా పెరిగాయి. అయితే ప్రపంచ సగటుతో చూసే మన వద్ద మరణాలు తక్కువ అని లెక్కలు చెబుతున్నాయి. కానీ మరణాలు దాస్తున్నాం అన్న ఆరోపణలో మన దేశంలోనే పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరణాలు దాచడం వల్ల ఏం సాధించబోతున్నారో అర్థం కాని పరిస్థితి ఇండియాది. దీనివల్ల ప్రజల్లో అవగాహన పెంచాల్సింది పోయి అక్కర్లేని భరోసాను పెంచుతోంది. గత 24 గంటల్లో 295 మంది చనిపోయారు. అదే ఇటలీలో 4 వేల కేసులొస్తేనే 1000 మంది చనిపోయేవారు. 

ఇక మొత్తం కేసుల సంఖ్యలో మనం 6వ స్థానంలో ఉన్నాం గాని... పెరుగుదల రేటులో మూడో స్థానం. అంటే త్వరలో మనం ఈ రికార్డను కూడా దాటేస్తాం. అమెరికా, బ్రెజిల్ తర్వాత రోజు వారి కేసులు ఎక్కువగా వస్తున్న దేశం మనదే. 

ఇక మన దేశంలో హైలైట్స్ చూస్తే..

  1. ఢిల్లీ, ముంబైలలో ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి.
  2. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లలో కరోనా విపరీతంగా ఉంది. 83 శాతం కేసులు ఇక్కడివే. 
  3. తమిళనాడు, కర్ణాటక, హర్యానా, జమ్ముకశ్మీర్, చత్తీస్ ఘడ్, జార్కండ్ లలో కేసుల సంఖ్య పెరుగుదుల రేటులో వృద్ధి ఎక్కువ.
  4. ఇప్పటివరకు దేశంలో 6649 మరణాలు నమోదవుతున్నాయి.
  5. మహారాష్ట్రలో 2849 మరణాలు ఇప్పటివరకు నమోదయ్యాయి.
  6. కేంద్ర సాయుధ బలగాల్లో ఇప్పటివరకు 9 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

కొసమెరుపు - నిర్లక్ష్యం చేయకండి. మీరు గవర్నమెంటు ఆస్పత్రిలో చికిత్సకు ఇష్టపడకపోతే మీరు కచ్చితంగా మిగతా అందరికంటే చాాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రైవేటు ఆస్పత్రిలో కొన్ని చోట్ల దీనికి 20 లక్షలు ఖర్చవుతోంది. దూరంగా ఉండండి. వ్యాప్తిని అరికట్టండి. జాగ్రత్తగా బతకండి. శుభ్రతే కరోనా శత్రువు.