ఐరాస ఎన్నికల్లో భారత్ గెలుపు... వాట్ నెక్స్ట్

August 12, 2020

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వపు ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. దీంతో.. భద్రతా మండలిలో భారత్ మరోసారి తాత్కాలిక  సభ్యదేశ హోదా లభించింది. 2021 జనవరి 1 నుంచి రెండేళ్లపాటు ఈ హోదాను ఉంటుంది. ఐరాసలో సభ్య దేశంగా భారత్ ఎంపిక కావటం ఇది ఎనిమిదో సారి.

55 మంది సభ్యులన్న ఆసియా - పసిఫిక్ గ్రూప్ నుంచి భారత్ ఒక్కటే పోటీచేసింది.
భారత్ తో పాటు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఐర్లాండ్.. మెక్సికో.. నార్వేలు కూడా భద్రతామండలి ఎన్నికల్లో విజయం సాధించగా.. కెనడా మాత్రం పరాజయం పాలైంది.

ఈ ఎన్నికల్లో గెలుపుతో ఏం జరుగుతుంది? భారత్ కు వచ్చే ప్రయోజనం ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే.. పెద్దగా ప్రయోజనం లేదనే చెప్పాలి. అలా అని తక్కువ చేయటానికి వీల్లేదు.

ఐక్యరాజ్యసమితిలో అత్యంత శక్తివంతమైన విభాగమైన భద్రతా మండలి.. అంతర్జాతీయంగా శాంతిభద్రతల పరి రక్షణను పర్యవేక్షిస్తుంది. ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించే వీలుంది.

తాత్కాలిక సభ్య దేశాలకు వారికిచ్చే రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్ పద్దతిన సర్వసభ్య సభ ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. మండలిలో కీలక నిర్ణయాలు తీసుకోవటానికి కనీసం తొమ్మిది దేశాల ఆమోదం తప్పనిసరి.

అంతేకాదు.. ఏదైనానిర్ణయానికి అవసరమైన సభ్య దేశాల ఆమోదం ఉన్నా.. శాశ్విత సభ్యదేశాల్లోని ఏ దేశం ఒప్పుకోనున్నా.. ఆ నిర్ణయం ఆమోదం పొందదు.అంటే.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని శ్వాశ్విత సభ్య దేశాలు మోస్ట్ పవర్ ఫుల్.

ఇందులో స్థానం కోసం భారత్ గడిచిన కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాన్ని చైనా మోకాలడ్డుతోంది. ఈ ఎన్నికల్లో విజయం భారత్ కు మంచిదే కానీ.. శాశ్విత సభ్య దేశాల్లో ఒకటిగా భారత్ అవతరించినప్పుడు మాత్రమే మరింత బలోపేతం అవుతుందన్నది మర్చిపోకూడదు.