కేంద్రం మరిన్ని సంచలన నిర్ణయాలు

August 11, 2020

క్రమంగా కొత్త కేసులు సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇక ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించవద్దని పేర్కొంది. రాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లా సరిహద్దులు కూడా మూసేయాలని పేర్కొంది. ఎవరైనా సరిహద్దులు తాజాగా దాటి ఉంటే వారిని 14 రోజుల క్వారంటైన్ కి తరలించాలని ఆదేశించింది.

మరోవైపు అద్దె ఇళ్లలో ఉన్న వారికి ఊరట ఇస్తూ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అద్దెల కోసం యజమానులు టెనెంట్లను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించింది. ఈరోజు కొత్తగా 110 కేసులు నమోదు కావడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కేంద్రం ముఖ్యమంత్రులతో మాట్లాడింది. వలస కూలీల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా, వారికి సదుపాయాలతో కూడిన క్వారంటైన్ ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఈ మేరకు బాధ్యతలను కలెక్టర్, ఎస్పీలకు అప్పగించింది.

మరోవైపు యోగి ఆదిత్యనాథ్ కూలీలకు బస్సులు ఏర్పాటుచేసి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వారికి భోజనం అందుబాటులో ఉంచారు. క్వారంటైన్ ముగిశాక వారిని తమ స్వస్థలాలకు పంపుతారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కూడా ఇదే పనిచేశారు. 

ఇక మిగతా రాష్ట్రాలకు కూడా కేంద్రం గట్టిగా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోను వలస కూలీలను క్వారంటైన్ లో ఉంచాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో గత మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనం అయిన వలస కూలీల వ్యాప్తి భయానికి కూడా కేంద్రం చెక్ పెట్టింది.