దేశం మొత్తం ఆశ్చర్యపోయింది ఏపీని చూసి..

May 28, 2020

జాతీయ స్థాయిలో ఈరోజు ఏపీ పరువు మరోసారి మంటగలిసింది. సీనియర్ రాజకీయ నేతలపై రాతియుగం మనుషుల్లా వైసీపీ నేతలు చేసిన దాడి జాతీయ మీడియాలో ప్రసారం అయ్యింది. సోషల్ మీడియాలోను హోరెత్తిపోయింది. దీంతో ఏపీలో పరిస్థితులు చూసి అందరూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిణామాలు ఏపీ ప్రజలనే కాదు, దేశంలో చాలామందిని భయపెట్టాయి. రాజన్న రాజ్యం తెస్తాను అన్న జగన్ అధికారంలోకి వచ్చాక... తాత రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజ్యం నెలకొల్పారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. 

తనది సుపరిపాలన అని భావించే జగన్ ... మనమే గెలవాలి అని నేతలను ఆదేశించడంతోనే జగన్ వంద శాతం ఓటమిని అంగీకరించినట్టు స్పష్టమైపోయింది. నిజంగా జగన్ భావిస్తున్నట్టు తన పాలనతో ప్రజలు సంతోషంగా ఉంటే... పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు గుద్దేయాలి కదా. కానీ మనం గెలవని చోట మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యులు అవ్వాలి. మీరేం చేస్తారో తెలియదు మనమే గెలవాలి అని అల్టిమేటం జారీ చేయడంతో మనం గెలిస్తే పరిస్థితులు లేవని భయపడి దాడులకు తెగబడుతున్నారు వైసీపీ నాయకులు. ఇతరు పార్టీ నేతలు నామినేషన్ వేస్తే మనం ఓడిపోయినట్టే భావిస్తున్నారు. అందుకే అసలు నామినేషన్ వేయకుండా చేస్తే గొడవలే లేదు కదా అన్న దాంతో దాడులు చేసి భయపెట్టి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. దీనికోసం సామదానబేధదండోపాయాలు ప్రయోగిస్తున్నారు. చివరకు హత్య చేయడానికి కూడా వెనుకాడలేదు.

బోండా ఉమ, బుద్ధా వెంకన్న వంటి సీనియర్ నేతలను వేటాడి వెంటాడి బహిరంగంగా కొట్టి చంపడానికి అది కూడా పట్టపగలు ప్రయత్నించారంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. కారు అద్దాలు పగలగొట్టు జనం అందరూ చూస్తుండగా... గునపాలు కారులో దూర్చి మనుషులను చంపేసే ప్రయత్నం చేశారు. ఈ వీడియో జాతీయ ఛానళ్లలో ప్రసారమైంది. దీంతో ఏపీలో ఎంత ఆటవిక పాలన సాగుతుందో ప్రపంచానికి అర్థమైపోయింది. దేశం మొత్తం ఈ చర్యకు నివ్వెరపోయింది. ఇలాంటి వార్తతో జాతీయ మీడియాకు ఎక్కడంతో తెలుగు ప్రజలు దీనిని ఇన్ సల్ట్ గా ఫీలవుతున్నారు. ప్రశాంతతకు మారుపేరయిన దక్షిణాది రాష్ట్రాల్లో మనకంటే అరాచకంగా ఉన్నాయని నార్త్ వాళ్లు భావించేలా వైసీపీ నేతలు పట్టపగలు చంపడానికి తెగబడ్డారు. నిందితులపై పోలీసలు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కానీ... తర్వాత ఏం జరుగుతుందో కూడా ఏపీలో ఎవరైనా చెప్పేయగలరు.