21 రోజులు... మీరు తెలుసుకోవాల్సిన నిజాలు

August 12, 2020
CTYPE html>
21 రోజులు అని మోడీ ప్రకటించిన వెంటనే అందరూ కంగారు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు పోవద్దు అంటున్నారు. అన్నీ బంద్ అవుతాయా? నీళ్లు, కూరలు, బియ్యం ఎలా అని భయపడకండి. తగిన జాగ్రత్తలతోనే 21 రోజుల క్వారంటైన్ దీక్ష నడుస్తోంది. మోడీ అంటే మనకు ఇష్టమున్నా లేకపోయినా మనకోసం ఇది పాటించాల్సిన అవసరం ఉంది. దేశం సంగతి తర్వాత... మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఇంట్లో ఉండండి. 
ఇవన్నీ తెరిచే ఉంటాయి...
1. కూరగాయల షాపు
2. చికెన్, మటన్, ఫిష్ పాులు
3. కిరాణా షాపులు 
4. మీకు ఇళ్లు లేకపోతే నివాస హోటళ్లు, హోం స్టేలు. 
5. నీరు సరఫరా చేసేవారు.
6. మెడికల్ షాపులు
7. ముఖ్యమైన గవర్నమెంటు విభాగాలు
8. ఇంటర్నెట్ సేవలు
9. బ్యాంకులు, ఏటీఎంలు
 
ఇక పోతే ఎందుకు ఈ 21 రోజులు?
మార్చి 22 నుంచి విదేశీ విమానాలు అన్నీ మన ఇండియాకు వచ్చాయి. అప్పటి నుంచి విదేశాల నుంచి ఎవరినీ అనుమతించలేదు. కాబట్టి విదేశాల నుంచి వ్యాధితో వచ్చిన వారందరూ 7 వ తేదీలోపు బయటకు వస్తారు. ఈరోజు నుంచి లాక్ డౌన్ ప్రకటించారు కాబట్టి వారి వల్ల ఎవరికైనా సోకితే 9వ తేదీ లోపు ఆ కేసులు బయటపడతాయి. అపుడు వైద్యం, సదుపాయాలు, మన దేశంలో తీవ్రత అన్నింటి గురించి క్లారిటీ వస్తుంది. అయితే... నిజంగా కరోనా కనుక మన దేశంలో ఎక్కువున్నట్లు తేలితే 21 రోజుల తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఏ ఊరు క్షేమం అనేది ఒక క్లారిటీ వస్తుంది.