ఫిక్సయిపోండి... లాక్ డౌన్ పొడగిపు గ్యారంటీ !

August 08, 2020

రోజురోజుకు దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల తప్ప తరుగుదల కనిపించడం లేదు. తబ్లిగి జమాత్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ఇప్పటికీ కొందరు దానికి హాజరైన వారు తప్పించుకుని తిరుగుతున్నారు. వారు ఎవరికి ఈ కరోనాను అంటిస్తున్నారో తెలియడం లేదు. దీంతో కేసులు తగ్గు ముఖం పట్టి కొత్త కేసులు ఆగిపోయే వరకు లాక్ డౌన్ పెట్టాల్సిందే అని అన్ని రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. లాక్ డౌన్ ఉండగానే జనాల్ని కంట్రోల్ చేయడం కష్టమైపోతోంది. లాక్ డౌన్ లేకపోతే అస్సలు కంట్రోల్ చేయలేం పలువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు.

నిన్న మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వారాలు కాదు నెల కంటే ఎక్కువ పెట్టిన సంతోషమే అంటున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోను, మహారాష్ట్రలోను తీవ్రత ఎక్కువగా ఉంది. తబ్లిగి జమాత్ కేసు ప్రభావం లేదిక అనుకునే వరకు లాక్ డౌన్ తప్పదనే ఉద్దేశంలోనే ఉన్నారు అందరూ. మరోవైపు టెస్టులు చేయించుకోమని ప్రభుత్వాలు పిలుపునిస్తుంటే... ఒక ముస్లిం కరోనా వ్యాధిగ్రస్తుడు, నిన్న కిటికీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. వీరి ఉద్దేశం ఏంటో... ఏ ప్రమాదం తలపెట్టారో అన్న భయం రాష్ట్రాల్లో ఉంది. మొత్తం ట్రాక్ చేసి... పరీక్షలు జరిపి సెట్ చేశాకే లాక్ డౌన్ తీయాలన్నది ముఖ్యమంత్రుల అభిప్రాయంగా ఉంది. అయితే... కేంద్రం కూడా ఇంత ఊహించలేదు. అందుకే కేసులు పెరుగుదల చూసి కేంద్రం కూడా ఇదే అభిప్రాయపడుతుండవచ్చు. 

ఏది ఏమైనా కనీసం రెండు వారాలు అయితే కచ్చితంగా లాక్ డౌన్ పొడగించే అవకాశాలున్నాయి.