భారతీయులను కరోనా ఏం చేయలేదు- చైనా

August 11, 2020
CTYPE html>
అవును నిజంగానే చైనా ఈ మాట చెప్పింది. అయితే... చైనా సర్కారు కాదు. చైనా కోవిడ్ పోరులో ఉన్న ఒక కీలక అధికారి ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ దేశాలన్నీ కకావికలం అవుతుంటే... భారతదేశంలో పరిస్థితులు చాలా నార్మల్ గా ఉన్నాయి. దీనికి కారణం వారి ఇమ్యూనిటీ పవర్ కాదు, వారి మానస్థిక స్థైర్యం అని ఆ అధికారి వ్యాఖ్యానించారు. అంటు వ్యాధుల నిపుణుడు జాంగ్ వెన్ హాంగ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భారత్ మూడోదశలోకి వెళ్లినా... కరోనా వారిని తీవ్రంగా ప్రభావితం చేయకపోవడం ఆశ్చర్యమే. అయితే, ఈ వ్యాధి పట్ల భారతీయులు ధైర్యంగా ఉన్నారని ఆయన అన్నారు.
ఓ మత సమావేశం గమనించాను. ఎవరూ మాస్కులు పెట్టుకోలేదు. వారి ఇమ్యునిటీ తక్కువే. కానీ వారి ధైర్యం ఎక్కువ. అందుకే భారతదేశంపై కరోనా పది శాతానికి మించి ప్రభావితం చేయలేదు అనిపిస్తుంది అన్నారు జాంగ్ వెన్. ఈయన వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. చైనా వాళ్లు మనదేశంలో ఏం జరుగుతుందో ఇంత తీక్షణంగా ఎందుకు పరిశీలిస్తున్నారు. అంటే ఇది చైనా సృష్టించిన బయోవార్ అన్నది నిజమేనా? అందుకే వారు ప్రతిపరిణామాన్ని గమనిసతున్నారా? ఇది తెలిశాకే మోడీ సరిహద్దు దేశాలు పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారా ? అన్న అనుమానాలు రాక మానవు.
మరో వైపు ఈరోజుతో ఇండియాలో కేసుల సంఖ్య 23077కి చేరింది. మరణాలు ఇప్పటివరకు 718. కొత్త కేసుల సంఖ్య 1684. రికవరీ రేటు 20.57 శాతంగా ఉంది. 28 రోజులుగా 15 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా రాలేదని, 14 రోజులుగా 80 జిల్లాల్లో కొత్త కేసులు రాలేదని లవ్ అగర్వాల్ తెలిపారు. ఉదయం ఏపీ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం... 62 కొత్త కేసులు వచ్చాయి.