​ఇండియాను ఎందుకు భారత్ గా మార్చాలి ?​

August 15, 2020

​సుబ్రమణ్య స్వామి అనే పెద్దాయన మీకు తెలిసే ఉంటుంది. ప్రముఖ రాజకీయ నేత. మనసు కలిగిన హిందుత్వ వాది. నాలుగు దశాబ్దాల క్రితం ఆ పెద్దాయన హోవార్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేసేవారు. ఒకానొక రోజు ఆయనను వెంటనే ఆ యూనివర్సిటీ ఉద్యోగంలోంచి పీకేసింది. ఎందుకో తెలుసా? ఇండియాలో ముస్లింలు ఉన్నా పర్లేదు. కానీ వారికి ఓటుహక్కు అవసరం లేదు అంటూ ఓ ముంబై పత్రికలో వార్త రాశారు.

ఆయన ఎలా సమర్థించారంటే... మన దేశాన్ని హిందు ముస్లిం అనే కోణంలో బ్రిటిషర్లు విభజించారు. ఆ విభజనకు మనవాళ్లు అందరూ ఒప్పుకున్నారు. ఆ క్రమంలో ముస్లింలు అందరూ పాకిస్తాన్ కు వెళ్లారు. హిందువులు అందరూ ఇండియాలో ఉన్నారు. అయితే... ఇష్టమున్న వారు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పడంతో కొందరు ముస్లింలు ఇక్కడే ఉండిపోయారు. అలాంటపుడు వారుండటం ఓకే గాని వారికి ఓటు హక్కు ఎందుకు? అన్నది సూక్ష్మంగా ఆ ఆర్టికల్ సారాంశం.

ఇకపోతే తాజాగా ఇండియా పేరును భారత్ లేదా హిందూస్థాన్‌గా మార్చాలని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో  పిటిషను వేశారు.  1948లో దేశం పేరును భారత్ లేదా హిందూస్థాన్‌గా పెట్టాలని బలమైన వాదన వినిపించిందని గుర్తు చేశారు. ఇది జూన్ 2వ తేదీన విచారణకు రానుంది. పేరును ఎందుకు మార్చాలో కూడా పిటిషనరు కూలంకుషంగా వివరించారు. ఇపుడు దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది.

ఇక పిటిషనరు చెప్పిన కారణాలు ఏంటంటే...  దేశం పేరు భారత్ లేదా హిందూస్తాన్ అని మార్చడం వల్ల ప్రజల్లో దేశం పట్ల ఆత్మగౌరవం, జాతీయభావం పెరుగుతుందని తెలిపారు. దేశం పేరును మార్చేందుకు రాజ్యాంగం సవరించాల్సి ఉంటుందని, దీనికోసం ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టను పిటిషనరు కోరారు. మన జాతీయ భాష హిందీ. ఇండియా అనేది ఇంగ్లీష్ పదం. దేశం పేరు మన జాతీయ భాసలో ఉండటం అవసరం.  అది మనకు గర్వకారణం అన్నారు. 

​ఎవరబ్బా  ​ఈ పిటిషన్​ వేసింది అంటే.... నమహ్. ​ఇతను ఒక భారతీయుడిగా మాత్రమే ఈ పిటిషను వేశారు.