తబ్లిగీలకు కేంద్రం భారీ షాక్

August 08, 2020

ఇండియాలో నేడు కరోనా ఇంత తీవ్రంగా ఉందంటే... దానికి ప్రధాన కారణం మర్కజ్ లో జరిగిన తబ్లిగి సమావేశం. విదేశాల నుంచి వచ్చిన పలువురు ముస్లిం మత ప్రవక్తలు... ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా భారతదేశం నలుమూలల నుంచి హాజరైన అమాయకులకు కరోనాను అంటించారు. తమకు కరోనా ఉందని తెలిసినా కొందరు ఈ సమావేశానికి హాజరు కావడం అత్యంత విషాదకరమైన విషయం.

కేవలం ఎన్నారైలపైనే దృష్టిపెట్టిన కేంద్రం దొంగచాటుగా పర్యాటక వీసా మీద వచ్చి మత సమావేశాలు నిర్వహించిన వీరిని పసిగట్టలేకపోయింది. పైగా వీరంతా పారాసిటమల్ మాత్రలు వేసుకుని థర్మల్ స్కానర్లకు దొరక్కుండా తప్పించకుకున్నారంటే వారికి ఎలాంటి దురుద్దేశాలు ఉన్నాయో ఇట్టే అర్థమైపోతుంది. వందల సంఖ్యలో వీరు మర్కజ్ సమావేశానికి హాజరు కావడమే కాకుండా... దేశంలోని నలుమూలలకు రైళ్లలో ప్రయాణించి పలుచోట్ల సమావేశాలు పెట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా చాప కింద నీరులా విస్తరించింది.

సూపర్ స్ప్రెడర్లకే సూపర్ స్ప్రెడర్ గా భారతదేశంలో మూలమూలకు కరోనా పాకడానికి తబ్లిగి విదేశీయులుకారణమయ్యారు. కాస్త ఆలస్యంగా గుర్తించినా అందరినీ ట్రేస్ చేసిన కేంద్రం... వారిని అరెస్టు చేసింది. తాజాగా 2200 మందిని బ్లాక్ లిస్టులో పెట్టి, వారిపై పదేళ్ల పాటు ఇండియాను సందర్శించడానికి వీల్లేకుండా నిషేధించింది. పర్యాటక వీసాపై వచ్చి నిబంధనలకు విరుద్ధంగా మత సమావేశాలకు హాజరవడం, వ్యాధి వ్యాప్తికి కారణం కావడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, రోగాన్ని దాచడం వంటి నేరాలపై తబ్లిగీలపై కేంద్రం కఠినంగా వ్యవహరించింది. 

మర్కజ్ తబ్లిగి ఘటన జరగకపోయి ఉంటే ఇండియా ఎపుడో బయటపడేది. తబ్లిగి జమాత్ తెరమీదకు వచ్చాక మొత్తం సమీకరణాలన్నీ మారిపోయాయి. దేశం కరోనా కేసులతో విలవిలలాడుతోంది.