భయానకం ... ఒక్క రోజులో భారత్ కేసులెన్నో తెలుసా?

August 11, 2020

కరోనా కేసుల్లో భారత్ లో ఈరోజు భయంకరమైన రికార్డు సాధించింది.  గత 24 గంటల్లో 4,987 కొత్త కేసుల రికార్డయ్యాయి. శనివారం ఉదయం 8 గంటల నుండి ఈరోజు ఉదయం 8 గంటల వరకు నమోదైన కేసులివి. ఇప్పటివరకు  మరణించిన వారి సంఖ్య 2,872 కు పెరిగింది. ఇప్పటికే చైనాను దాటేసిన మనదేశంలో ఈ ఉదయానికి మొత్తం నమోదైన కేసులు 90,927 కు చేరాయి. గత 24 గంటల్లో 120 మరణాలు సంభవించాయి.

క్రియాశీలంగా COVID-19 కేసుల సంఖ్య 53,946 కాగా, 34,108 మంది కోలుకున్నారు.  అంటే ఇప్పటివరకు 37.51 శాతం మంది రోగులు కోలుకున్నారు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. దేశంలోని మొత్తం కేసుల్లో 4 రాష్ట్రాల వాటా 65 శాతం.

మహారాష్ట్రలో 30,706 కేసులుండగా, గుజరాత్  10,988, తమిళనాడు 10,585, ఢిల్లీ 9333 కేసులున్నాయి. శనివారం ఉదయం నుంచి నమోదైన 120 కొత్త మరణాలలో 67 మహారాష్ట్రలో, 19 గుజరాత్‌లో, ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, పశ్చిమ బెంగాల్‌లో ఏడు, ఢిల్లీలో ఆరు, మధ్యప్రదేశ్‌లో నాలుగు, తమిళనాడులో మూడు, హర్యానాలో రెండు మరణాలు సంభవించాయి.  

మొత్తం 2,872 మరణాలలో 1,135 మరణాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది, గుజరాత్ 625 మరణాలతో రెండవ స్థానంలో ఉంది, మధ్యప్రదేశ్ 243, పశ్చిమ బెంగాల్ 232,  ఢిల్లీ 129, రాజస్థాన్ 126, ఉత్తర ప్రదేశ్ 104, తమిళనాడు 74 ఆంధ్రప్రదేశ్ 49 వద్ద ఉన్నాయి.