కోవాక్సిన్ - హైదరాబాదు కంపెనీ ఘన విజయం

August 14, 2020

కరోనా నియంత్రణ వాక్సిన్ తయారీలో భారతదేశం గొప్ప ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ కంపెనీ కరోనా వైరస్ కట్టడికి "కోవాక్సిన్"  పేరుతో కోవిడ్ 19 వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది.  కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ స్టేజ్ 1, స్టేజి 2 కి డీసీజీఐ అనుమతి కూడా మంజూరు చేసింది.

కోవాక్సిన్ కోవిడ్ నియంత్రణకు తయారైన తొలి స్వదేశీ వాక్సిన్. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, ఎన్ఐవీ సంయుక్తంగా కోవాక్సిన్ తయారీలో విజయవంతం అయ్యాయి. జులై నుంచి మానవులపై ప్రయోగాలు చేయనున్న భారత్ బయోటెక్ - కోవాక్సిన్ తయారీ చరిత్రాత్మకం అవుతుందని భారత్ బయోటెక్ ఎండీ డా.కృష్ణా ఎల్లా అన్నారు. ఈయన ఎవరో కాదు, ఈనాడు ఎండీ కిరణ్ వియ్యంకులు. 

ఐసిఎంఆర్,  ఎన్‌ఐవి (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) సహకారంతో నగరానికి చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన దేశంలోని ‘మొదటి’ స్వదేశీ కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్, 

ప్రీ-క్లినికల్ ట్రయల్స్ లో సేఫ్టీ, ఇమ్యూన్ రెస్పాన్స్ కి ఈ వాక్సిన్ స్పందించిన తీరుపై కంపెనీ ఇచ్చిన పరిశోధన పత్రం ప్రభుత్వం పరిశీలించిన అనంతరం డీసీజీఐ, ఎన్ ఐవీ అనుమతులు ఇచ్చాయి. 
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) ల సహకారం టీకా అభివృద్ధికి కీలకపాత్ర పోషించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

హైదరాబాదులోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ బిఎస్ఎల్ -3 (బయో-సేఫ్టీ లెవల్ 3) హై కంటైనర్ ఫెసిలిటీలో ఈ స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడింది.

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, సిడిస్కో (ది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్), ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దశ 1 మరియు II మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి అనుమతి ఇచ్చాయి. ఈ దశలో విజయవంతం అయితే... ఇక భారత్ తిరుగులేని శక్తి అవుతుంది. భారత ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో ఈ విజయం సాధించినట్లు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా అన్నారు.

భారత్ బయోటెక్‌తో పాటు, కనీసం ఐదు ఇతర భారతీయ కంపెనీలు ప్రాణాంతకమైన కరోనావైరస్ కోసం వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్నాయి, వివిధ దేశాలలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.