భారత్ - చైనా... అమెరికా తాజా ప్రకటన

August 13, 2020

అమెరికా అల్లర్లతో అట్టుడుకుతోంది. తన తోక కాలిపోతున్నా అంతర్జాతీయ అంశాలపై ఆ దేశం దృష్టిపెడుతూనే ఉంది. మన సరిహద్దుల్లో చైనా వేస్తున్న వేషాలపై అమెరికా స్పందించింది. అమెరికా విదేశీ వ్యవహారాల హౌస్ కమిటీ చైర్మన్ ఎలియట్ ఎంగెల్ తాజాగా చైనాకు ఒక సీరియస్ సూచన చేశారు. ఇది చిన్నపాటి హెచ్చరికలా కూడా ఉంది.

ఆయన ఏమన్నారంటే...

భారతదేశం-చైనా సరిహద్దుపై వాస్తవ నియంత్రణ రేఖ వెంట కొనసాగుతున్న చైనా దురాక్రమణ గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. అంతర్జాతీయ చట్టం ప్రకారం విభేదాలను పరిష్కరించడం కంటే పొరుగువారిని బెదిరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా మరోసారి బుద్ధిని ప్రదర్శిస్తోంది

దేశాలు అన్ని ఒకే విధమైన నియమాలకు కట్టుబడి ఉండాలి, అపుడే మనం “సరైనది” అనదగిన ప్రపంచంలో జీవించగలం. భారతదేశంతో సరిహద్దు ప్రశ్నలను పరిష్కరించుకోవడానికి చైనా అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని భావిస్తున్నాం. దౌత్యం, విదేశీ యంత్రాంగాలను ఉపయోగించాలని నేను గట్టిగా కోరుతున్నాను

- ఎలియట్ ఎంగెల్, విదేశీ వ్యవహారాల హౌస్ కమిటీ చైర్మన్, యునైటెడ్ స్టేట్స్