NRI : అమెరికా అభ్యర్థి ఇండియాకు భారీ ఆఫర్

August 12, 2020

గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఎన్నికల్లో భారతీయులపై ఇరు పార్టీల అభ్యర్థులు తెగ ప్రేమ కురిపిస్తూ వస్తున్నారు. దీనికి కారణం... అమెరికాలో పెద్ద సంఖ్యలో ఇండియన్లు స్థిరపడటమే కాదు, వారి వల్ల ప్రభావితమయ్యే ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పీవీ హయాం నుంచే మెల్లగా అమెరికాతో పరోక్ష సంబంధాలు నెరిపిన మనం వాజ్ పేయి దిగిపోయే నాటికి సంబంధాలు బాగానే బలపరుచుకున్నాం. కాస్త అణు పరీక్షల వల్ల అమెరికా అలిగింది గాని మిగతా అంతా దాదాపు ఇండియాకు అనుకూలంగానే ఉంది. అయితే... వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి తర్వాత పాకిస్తాన్ అసలు స్వరూపం తెలుసుకున్న అనంతరం అమెరికా ఇండియాను మరింతగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది.

ఇక నవంబరులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ప్రత్యర్థిగా పోటీ చేయబోయే డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ కూడా ఇండియా పట్ల తీవ్ర సానుకూలత వ్యక్తపరిచారు. వర్చువల్ ఫండ్ రైజింగ్ కార్యక్మంలో భాగంగా భారత్ - యుఎస్ సంబంధాలపై ఆయను ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సుదీర్ఘంగా స్పందించారు.

ఆయన ఏమన్నారంటే... ‘‘తాను అధ్యక్షుడిని అయితే ఇండియాకు తన పాలనలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇండియాను తమ సహజ భాగస్వామిగా చేసుకుంటాం.  ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తాం. భారత్ కు ఓ బలమైన భాగస్వామి కావాలి. ఆ భాగస్వామ్యం అమెరికాకూ రక్షణ కల్పిస్తుంది. ఇరువురికి ఇది లబ్దిని చేకూరుస్తుంది" అని అన్నారు. 

"మన భద్రతకు ఇండియాతో స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యం తప్పనిసరి" అని బిడెన్ పేర్కొనడం గమనార్హం. తాను ఉపాధ్యక్షుడిగా ఉన్నపుడు భారత్ తో పౌర అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఇది చాలా పెద్ద డీల్. ఆనాడు ఒబామా - బిడెన్ ల పానలో ఏం జరిగిందో, నేను గెలిస్తే, మరోసారి అటువంటి సంబంధాలే ఇండియాతో ఉంటాయి’’ అని జో బిడెన్ బల్లగుద్ధి మరీ చెప్పారు.

అమెరికాలో భారతీయులు, భారతీయ సంతతి ప్రభావం ఏంటో కచ్చితంగా అర్థం చేసుకున్న జో బిడెన్ భారతదేశంతో బంధాన్ని బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన డెలావర్ సెనెటర్ గా ఉన్నారు.