NRI -  ట్రంప్ ప్రత్యర్థి జో బిడెన్ ను నడిపించేది ఒక మనమ్మాయే

August 10, 2020

భారతీయ-అమెరికన్ అయిన యువ మహిళ మేథా రాజ్‌ కి కీలక పదవి దక్కింది. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ తన డిజిటల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా మేథారాజ్ ను నియమించారు. కరోనా వైరస్ విపరీతంగా సంక్రమించిన సమయంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు రావడంతో ప్రచారం మొత్తం డిజిటల్ గానే సాగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం కొనసాగుతోంది. ఈ సమయంలో మేథా రాజ్ అత్యంత కీలకంగా మారారు.

మేథా రాజ్ దీనిపై లింక్డ్ ఇన్ లో స్పందించారు.  "నేను జో బిడెన్ యొక్క ప్రచారంలో డిజిటల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నికలకు 130 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మేము ఒక్క నిమిషం కూడా వృథా చేయబోవడం లేదు!" అని ఆమె అన్నారు.

కరోనావైరస్ మహమ్మారి వల్ల అమెరికా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. 2.64 మిలియన్లకు పైగా అధికారిక కేసులు నమోదు కాగా, 128,000 మంది మరణించారు. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికలు రావడం ఒక అతిపెద్ద పరిణామం. జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ రాజకీయాల్లో గ్రాడ్యుయేట్ అయిన మేథా రాజ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

గతంలో హిల్లరీ క్లింటన్ యొక్క 2016 ప్రచారంలో పనిచేసిన క్లార్క్ హంఫ్రీ దక్కించుకున్నారు. ఆయన డిప్యూటీ డిజిటల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఫండ్ రైజింగ్ లో క్లార్క్ ది కీలక పాత్ర.

77 ఏళ్ల జో బిడెన్ నవంబర్ 3 న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 74 ఏళ్ల రిపబ్లికన్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై పోటీ చేస్తున్నారు. ఆగస్టు 20 న విస్కాన్సిన్‌లోని మిల్వాకీ నగరంలో జరిగిన పార్టీ స్కేల్డ్ బ్యాక్ కన్వెన్షన్‌లో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ తన డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ నామినేషన్‌ను అధికారికంగా ఆమోదించాల్సి ఉంది.

ఇదిలా ఉండగా కొన్ని తాజా అభిప్రాయ సేకరణల ప్రకారం, జో బిడెన్ డొనాల్డ్ ట్రంప్ కంటే ఎనిమిది శాతానికి పైగా పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు.