రిపోర్ట్ - మన ఎన్నారైల రికార్డు ఏ దేశమూ సాధించలేదు

August 07, 2020
CTYPE html>
ఇది గర్వించదగ్గదే. రెండు జనరేషన్లలో పరిస్థితి తారుమారు అయ్యింది. మనం చిన్నపుడు రవి అస్తమించని దేశం అని బ్రిటన్ గురించి చదువుకునే వాళ్లం. కానీ ఇపుడు సూర్యాస్తమయాన్ని చూడని భారతీయులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే... ఆ రోజు అన్నీ దేశాలను ఆక్రమించిన బ్రిటన్ వారి పాలన, వారి దేశంగా పేర్కొంటూ రవి అస్తమించని దేశం అని చెప్పుకుంది. కానీ అలాంటి దురంహకార నినాదంతో కాకుండా మేథోశక్తితో ప్రపంచాన్ని ఏలుతున్నారు భారతీయులు. ప్రపంచ వ్యాప్తంగా 1. 75 కోట్ల భారతీయులు వివిధ దేశాల్లో నివసిస్తున్నారట. ఇది ఐక్య రాజ్యసమితి ఇచ్చిన రిపోర్ట్. ఈ రికార్డు ఎప్పటికీ కొనసాగనుంది. ఎందుకంటే.. ఇప్పటికీ ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారిలో భారతీయులే అధికమట. 
ప్రపంచ దేశాల్లో మన వారు లేని రంగం లేదు, మన వారు లేని దేశమూ లేదు. ఈ భూమి మీద ఎన్ని దేశాలుంటే అన్ని దేశాల్లో మన భారతీయులున్నారు. ముఖ్యంగా మేథో శక్తిని వీరిని ఆహ్వానిస్తున్న ఆయా దేశాలు మర్యాదను కూడా ఆ స్థాయిలోనే ఇస్తున్నాయి. ఒకపుడు బలంతో దండెత్తి ఇది మా దేశం అని యూరప్ దేశాల వారు అనేవారు. కానీ మన భారతీయులకు అన్ని దేశాలు రెడ్ కార్పెట్లువేసి పిలుస్తున్నాయి. మేధోతనంలో ఎన్నారైలను కొట్టేవారే లేరు. 
వలస వెళ్లే వారిలో టాప్ ఇండియా కాగా, మెక్సికో రెండో స్థానంలో, చైనా మూడో స్థానంలో, రష్యా నాలుగో స్థానంలో ఉన్నాయి. ఖండాల పరంగా ఐరోపాకు ఎక్కువ మంది వలస వెళ్తుండగా, ఆ తర్వాత స్థానం ఉత్తర అమెరికాది. దేశాల పరంగా చూస్తే వలసదారులకు అమెరికా స్వర్గధామంగా ఉంది. అన్నిదేశాల నుంచి వలసను స్వీకరించే టాప్ కంట్రీగా అమెరికా నిలుస్తోంది. ఆ తర్వా స్థానాల్లో జర్మనీ, సౌదీ అరేబియా, రష్యా, యుకె ఉన్నాయి. 
 
వలస దారులను స్వీకరించడంలో భారత్ తొలి పది స్థానాల్లో లేదు. 2019 లో భారత్ కు 51 లక్షల మంది వలస రాగా, 48.8 శాతం మంది మహిళలు ఉన్నారు. మన వద్దకు వచ్చే వలసల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ నుంచి వచ్చే వారు అధికం.