వామ్మో... నష్టం 46 లక్షల కోట్లట!

August 12, 2020

జేబులో ఉన్న రూ.100 పోతే బాధ పడిపోతాం. అలాంటి పదివేలు పోతే విలవిలాడిపోతాం. అలాంటిది అనుకోని రీతిలో ఒకట్రెండు లక్షలు నష్టపోతే.. ఇక ఎప్పటికి కోలుకుంటామోనని సగటుజీవి ఫీల్ అవుతుంటాడు. ఇంత చిన్న మొత్తాలకే ఇలా అనుకుంటే.. గడిచిన కొద్దిరోజుల్లో స్టాక్ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు.. కరోనా ప్రభావంతో సెంటిమెంట్ దెబ్బ తిని.. భారీగా నష్టపోయాయి షేర్లు. కొద్దిరోజుల వ్యవధిలో స్టాక్ మార్కెట్ లో కరిగిపోయిన పెట్టుబడుల విలువ ఎంతో తెలిస్తే.. గుండెలు అదిరిపోవాల్సిందే. ఎందుకంటే.. ఆ మొత్తం విలువ రూ.46లక్షల కోట్లు.
ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో 32 శాతం మేర సెన్సెక్స్.. నిఫ్టీ సూచీలు నష్టపోవటంతో మార్కెట్లు దారుణమైన ఉచకోతకు గురయ్యాయి. ఇంత భారీ ఆర్థిక ఉత్పాతం చోటుచేసుకున్నప్పుడు.. దాని ప్రభావానికి లోనైన పెద్ద మనుషులు ఉంటారు కదా? వారెవరు? వారికి ఎంత నష్టం జరిగింది? అన్నది చూస్తే.. నోటి వెంట మాట రాదు కదా? ఇలాంటి ఎదురుదెబ్బలు వారు మాత్రమే తట్టుకోగలరేమోనన్న భావన కలగటం ఖాయం.
స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టే పెద్ద మనుషుల విషయానికి వస్తే.. రాకేశ్ ఝున్ ఝున్ వాలా.. ఆశిష్ ధావన్..అనిల్ కుమార్ గోయెల్ ఫ్యామిలీతో పాటు ఆశిష్ రామచంద్ర కచోలియా.. డాలీ ఖన్నాల మీద పడిన ప్రభావం వేలాది కోట్లుగా చెప్పక తప్పదు. రాకేశ్ ఝున్ ఝున్ వాలా .. ఆయన కుటుంబం ఈ క్యాలెండర్ ఇయర్ లో నష్టపోయిన మొత్తం ఏకంగా రూ.3554 కోట్లు. దీంతో.. మూడు నెలల వ్యవధిలో వారి పెట్టుబడుల విలువ రూ.12480 కోట్లు నుంచి రూ.8925 కోట్లకు పడిపోయింది.
రాకేశ్..ఆయన సతీమణి రేఖకు టైటాన్ షేర్లు దాదాపు 6.69 శాతం వాటా ఉంది. ఈ ఒక్క కంపెనీలోనే ఆయన రూ.1710 కోట్లు నష్టపోయారు. రాకేశ్ మాదిరి అనిల్ కుమార్ గోయెల్ - సీమా గోమెల్ భారీగా నష్టపోయారు. షేరు మార్కెట్లు అప్పుడప్పడు అగ్ర స్థానానికి తీసుకెళ్లటమే కాదు.. చూస్తున్నంతనే ఎంతో నిర్దయగా పాతాళానికి తొక్కేస్తుంది.అలాంటి చోట.. వ్యాపారమే ఆట ఆడటం ఎంత డేంజరో వీరి ఉదంతాల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతాయి.