షాక్- ఆదివారం మాంసం తినకూడదా?

August 21, 2019

మనకు ఆదివారం చికెన్ ముక్క లేకుంటే ముద్ద దిగదు. ఆరు రోజులు పనిలో మునిగి వేళకు తినకుండా లంచ్ బాక్స్ లోని బోర్ కొట్టే భోజనం తినే సామాన్యుడు... ఆదివారం వస్తే మటన్ షాపు వద్ద క్యూ కడతాడు. అదేదో యాడ్ లో చెప్పినట్లు ఏం చేయకపోవడమూ ఎంజాయ్ చేయడం కిందే లెక్క అన్నట్టు... చక్కగా మాంసాహార విందు ఆరగించి అలాగే టీవీ చూస్తూ ఒళ్లు వాల్చడం చాలా మందికి అలవాటు. అయితే... మనది కాని, మనకు నష్టం చేసే ఒక సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నామని మన పురాణాలు ఘోషిస్తున్నాయట. ఆదివారం మాంసాహారం మనల్ని శక్తి హీనుల్ని చేస్తుందట. ఆ వివరాలు చెప్పే ఓ వైరల్ పోస్ట్ ఇది.

 

⭕ *ఆదివారం అత్యంత శక్తి వంతమైన రోజు*.

సృష్టికి ఆద్యం ఆదివారం. దీనికి తోడు సూర్యుణ్ణి ప్రత్యక్ష భగవానుడు అంటారు. ప్రస్తుతం మనం ఏవిషయాన్నైనా అన్వేషించాలంటే సూర్యుని నుంచే ప్రారంభమవుతుంది చివరకు సూర్యునితోనే అంతమవుతుంది...

⭕ *సైన్స్ ప్రకారం చూసినా* కూడా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టే తిరుగుతున్నాయి. అంటే ఈ విశ్వంలో జీవించే ప్రతీ ప్రాణీ ప్రత్యక్షంగా సూర్యునిపై ఆధారపడిందన్నది సుస్పష్టం. వారంలోని ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా ఇంత తప్పులేదు కానీ...ఒక్క ఆదివారం మాత్రం మాంసాహారం తినకండి...

⭕ ఆదివారం మాంసాహారం తిన్నవారు శక్తి హీనులవుతారని...మన వేదాల్లో ఉంది. ఉదాహరణకి ఈ రోజు నుంచి మీరు ఆదివారాన్ని గమనించండి. ఆరోజున మిగిలిన రోజుల్లో లేని ఒక శక్తి ఉంటుంది. ఈ శక్తిని మన శరీరంలోకి ఆహ్వానించేంత చైతన్యం మనలో ఉండాలి. అందుకే *ఆదివారం* రోజున మాంసాహారాన్ని త్యజించిన వారు విజేతలు అవడం ఖాయం. దానికి తోడు ఆ సూర్యభగవానుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు...

⭕ మన దేశానికి బ్రిటీష్ వారు వచ్చినపుడు భారతీయుల్లో ఉన్న మేధోశక్తికి...సంపూర్ణ ఆరోగ్యానికి అబ్బురపడ్డారు. ఎందుకు భారతీయులు ఉత్తేజంగా... ఉల్లాసంగా.. సిరిసంపదలతో తులతూగుతున్నారో అన్వేషించారు. చివరకు *ఆదివారం* నాడు మన పూర్వీకులు అవలంబిస్తున్న నియమాలే అందుకు కారణమని తెలుసుకున్నారు...

⭕ భారతీయుల్ని ఇలాగే వదిలేస్తే ప్రపంచాన్ని జయించగలరని అనుమానం ఇంగ్లీషువాళ్లల్లో కలిగింది. ఎలాగైనా సరే భారతీయుల్ని శక్తిహీనుల్ని చేయాలని భావించారు. దీంతో *ఆదివారం* రోజుని సెలవుదినంగా ప్రకటించడంతో పాటు ఆరోజున మద్యం మాంసంతో పాటు నియమాలు పాటించకుండా మానేసేలా చేశారు...

⭕ ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీషువారే పాలించడంతో ఆనాటి నుంచి ఆదివారం సెలవు దినంగా వారు ప్రకటించారు. కానీ తాము మాత్రం *ఆదివారం* నాడు ఖచ్చితంగా భగవంతుణ్ణి ఆరాధించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆరోజున కచ్చితంగా తమ ప్రార్ధనాస్ధలాలకి రావాలనే నియమాన్ని పెట్టు కున్నారు...

⭕ ఇలా మన ఆచారానికి మత రంగు అద్దుకుని *ఆదివారం* నాటి శక్తిని క్రిష్టియన్స్ పొందుతున్నారు. కానీ నాటి నుంచి మనం మాత్రం ఆదివారం 'మందు ముక్క' అంటూ తమ తరతరాల ఆచారాన్ని పక్కదోవ పట్టించుకున్నాము...

⭕ కాబట్టి ఇప్పటికన్నా *ఆదివారం* నాటి శక్తిని మనం గుర్తించాలి. ఆదివారం రోజున మన చేతనైన నియమాలు పాటించాలి, మన భవిష్యత్ తరముల కొరకు - మన పిల్లలు అందరూ పాటించేలా చేయాలి ......

*శ్రీ సూర్యనారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు*

Read Also

ఆ 7 ఎంపీ సీట్లు జగన్ ఖాతాలో వేసిన పవన్
శుభ ముహూర్తాలు - మే 18, శనివారం
ముహూర్తం : మే 17 ఏ నక్షత్రం వారికి మంచిది?

RELATED ARTICLES

  • No related artciles found